టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా చేస్తున్నాడంటే ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక మహేశ్ అభిమానులకు అది పండగలాంటి వార్త. మహేశ్ ఏ దర్శకుడితో చేయబోతున్నాడు, హీరోయిన్ ఎవరు.. క్యాస్టింగ్ ఎవరు అనే చర్చలు జరిగిపోతూంటాయి. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చిన మహేశ్ బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేశాడు. ప్రస్తుతం వెకేషన్ పూర్తి చసుకొచ్చిన మహేశ్ తన తర్వాతి సినిమా గురించి చర్చలు మొదలెట్టాడు. వంశీ పైడిపల్లితో అనుకున్న సినిమా ఆగిపోయిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పరశురామ్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

 

 

ఈ వార్తలను పక్కనపెడితే మహేశ్ సినిమాల గురించి మరో ఆసక్తికరమైన వార్త రౌండ్ అవుతోంది. తన రెగ్యులర్ సినిమాతో పాటు ఓ రెండు సినిమాల్లో కీలకపాత్ర పోషించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఒకటైతే రెండోది వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్న ఎఫ్3 సినిమా రెండోది. ఈ రెండు సినిమాల్లో కూడా 30 నిమిషాల ప్రత్యేక పాత్రలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే రౌండ్ అవుతున్న వార్తలు ప్రకారం ఈ పాత్రల తీరుతెన్నులపై మహేశ్ వద్ద సమాచారం ఉందని అంటున్నారు. మల్టీస్టారర్ కాకపోయినా మంచి పాత్రలు కాబట్టి చేసే ఆలోచనలో ఉన్నాడని ఫిలింనగర్ లో వార్తలు రౌండ్ అవుతున్నాయి.

 

 

ఈ వార్తలపై అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మహేశ్ ఇంతవరకూ వెంకటేశ్ తో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు మాత్రమే మల్టీస్టారర్ చేశాడు. మరి ఈ వార్తలపై మహేశ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మహేశ్ తర్వాతి సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మైత్రీ బ్యానర్ లో పరశురామ్ ఈ సినిమా చేస్తాడంటున్నారు. మరి మహేశ్ నిర్ణయమేంటో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: