దర్శక ధీరుడు రాజమౌళి సినిమా చేస్తే ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. టాలీవుడ్ లో ఆయన చేసే సినిమాలకు ఒక మార్క్ ఉంటుంది. వాటికి ఒక రేంజ్ కూడా ఉంటుంది. ప్రతీ పాత్రను కూడా ప్రాణం పెట్టి చేస్తారు ఆయన. ఏ చిన్న తేడా రాకుండా ప్రతీ సీన్ కూడా అత్యున్నత ప్రమాణాలతో ఉంటుంది. సినిమా ఇవాళ కాకపోతే రేపు రిలీజ్ చేస్తాం, అంతే గాని ఒక్క సీన్ తేడా వస్తే రిమార్క్ పడుతుంది అన్నట్టు భావించి ఆయన సినిమాలు చేస్తూ ఉంటారు. ఆయన చేసిన సినిమాలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

ఇది పక్కన పెడితే ఆయన ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయినట్టు సమాచార౦. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వస్తుంది ఈ సినిమా. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఇక్కడ రాజమౌళి మాత్రం ఎవరిని నమ్మడం లేదని సమాచార౦. షూటింగ్ సమయంలో కొంత మంది దర్శకులు సహాయ దర్శకులకు బాధ్యతలు అప్పగిస్తారు. 

 

కాని ఈ సినిమాలో రాజమౌళి మాత్రం అలాంటిది ఎక్కడ చేయడం లేదనే టాక్ వినపడుతుంది. చిన్న చిన్న సన్నివేశాలను కూడా సహాయ దర్శకులకు ఆయన ఇవ్వడం లేదని అంటున్నారు. ఇక సినిమా షూటింగ్ లో ఫోన్ లను బాన్ చేసిన ఆయన, ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం పక్కకు తప్పించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో కొంత భాగం నదిలో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. దీనితో ఆ సీన్ విషయంలో స్వయంగా నదిలోకి వెళ్ళడం, అక్కడ కూడా కెమెరా పర్యవేక్షణను ఒకటికి రెండు సార్లు చేసే సీన్ ని ఓకే చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: