తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్  హీరోయిన్ ల  రేసులో చేరింది సమంత. ఇప్పటికే ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి తనదైన అందం అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇప్పటికే టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సరసన నటించిన  ఈ అమ్మడు... కొంతమంది చిన్న  హీరోలతో కూడా రొమాన్స్ చేసింది. ఇక మొదటి సినిమాతోనే అక్కినేని వారసుడు నాగచైతన్య తో ప్రేమాయణం నడిపి  ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సమంత పెళ్లి తర్వాత క్రేజ్  ఎక్కడికో  వెళ్ళిపోయింది. తరువాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యం ఉన్న వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది సమంత. 

 

 

 పెళ్లి తరువాత ఈ అమ్మడి లక్కు బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి. సమంత చేసిన సినిమాలన్ని  బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి.  అయితే కొన్ని రోజుల్లో సమంత కొత్త అవతారం ఎత్తబోతుంది. మంచూ వారి  వారసురాలు లక్ష్మీ దారిలోనే సమంత కూడా నడవబోతున్నట్లు  సమాచారం. ప్రస్తుతం వరుస  సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు... ఇప్పుడు హోస్ట్ గా  కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమైంది.. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. లక్ష్మీరానా దగ్గుబాటి తరహాలోనే... సమంత  చేయబోయే టాక్ షో కూడా ఉండబోతోందని తెలుస్తోంది. 

 

 

 హోస్ట్ గా కూడా  సమంత అదరగొట్టేందుకు  సిద్ధమైంది. అయితే ఈ టాక్ షో కోసం సమంతకు భారీగానే పారితోషికం ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది టీవీ లో రాదు... కేవలం ఓటిటి  ప్లాట్ ఫామ్ లో మాత్రమే వస్తుంది . ఇప్పటికే తెలుగులో చాలా షోలు వస్తుండగా...  వాటన్నిటికీ భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. అయితే ఈ షో ఎందులో వస్తుంది ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: