ఇండస్ట్రీలో భారీ ఓపెనింగ్స్ సాధించాలంటే కచ్చితంగా విపరీతమైన క్రేజ్ మరియు మంచి మార్కెట్ కలిగిన స్టార్ హీరో అయి ఉండాలి. ఇటువంటి పాపులారిటీ ఉన్నప్పుడు సినిమా విడుదలైతే ఓపెనింగ్ సమయంలో కలెక్షన్లు బీభత్సంగా వస్తాయి. సినిమాకి పెట్టిన బడ్జెట్ రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే వచ్చేసిన ఆశ్చర్య పడనక్కరలేదు. ఇలాంటి మార్కెట్ కలిగిన హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్నది చాలా మంది అయినా గాని ఎక్కువగా మహేష్ మరియు ఎన్టీఆర్ వినబడతాయి. మహేష్, ఎన్టీఆర్ నటించిన సినిమాల పెట్టుబడి పెట్టిన బడ్జెట్ విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే సగానికి సగం వచ్చేస్తుంది. అందువల్లే ఎక్కువగా నిర్మాతలు వీళ్ళతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు.

 

ఏ మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఖచ్చితంగా సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ. ఇప్పుడు వీళ్ళ లాగానే ఆ రేంజ్ కి వెళ్దామని అనుకుంటున్న వారి పేర్లు ఇండస్ట్రీలో బలంగా వినబడుతున్నాయి. ఇంతకీ అరేంజ్ అందుకోవటం అయ్యే పనేనా..?. వినపడుతున్న పేర్లు చూస్తే విజయ్ దేవరకొండ, అక్కినేని అఖిల్, నాచురల్ స్టార్ నాని, వరుణ్ తేజ్ మరియు అదే విధంగా సాయి ధరమ్ తేజ్.

 

వీళ్లంతా మహేష్ మరి ఎన్టీఆర్ లాగా తమ సినిమాలతో మొదటి రోజే పెట్టుబడి పెట్టిన నిర్మాతకి వచ్చే విధంగా పాపులారిటీ మరియు స్టార్ స్టేటస్ దక్కించుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో విజయ్ దేవరకొండ ఆ స్థాయిలో కి వెళ్లినట్లే వెళ్లి అమాంతం డౌన్ ఫల్  చూశాడు. దీంతో వీళ్ళందరూ ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలలో టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఏ మాత్రం రెండు మూడు భారీ బ్లాక్ బస్టర్ విజయాలు వస్తే కనుక వీరి కలెక్షన్ గ్రాఫ్ కూడా గ్యారెంటీగా పెరిగిపోవడం ఖాయమని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: