సినిమా అంటే తమిళ్ సినిమా... వాళ్లకు సినిమా ఏ విధంగా తీయవచ్చో తెలుసు, వాళ్లకు నటుడు నుంచి ఎం తీసుకోవాలో తెలుసు... వాళ్లకు సినిమాలో ఎం ఉంటే బాగుంటుందో తెలుసు. కొంత మంది తెలుగు వాళ్ళు ఈ మధ్య ఎక్కువగా చేస్తున్న కామెంట్ ఇది. అవునా నిజమా...? మన వాళ్లకు సినిమా తీయడం రాదా...? వచ్చు గాని కొన్ని కొన్ని మాత్రం రావు. మరి మన వాళ్లకు ఎం రావు...? చాలానే రావు. అసలు అవి ఏంటీ...? మరి ఇంత మంచి సినిమాలు ఏ విధంగా తీస్తున్నారు...? 

 

నటుడ్ని డిమాండ్ చేయడం మన వాళ్లకు తెలీదు. అవును నాకు ఇలాగే కావాలీ అని దర్శకుడు అడగలేడు, నిర్మాత అడగలేడు ఇంకెవరికి ఆ ధైర్యం. ఈ సీన్ ఇలా ఉంటేనే బాగుంటుంది అని దర్శకుడు అనుకున్నా... హీరో మాత్రం అలా వద్దని అంటాడు. మన వాళ్లకు అసలు డిమాండ్ చేయడం తెలియదు. భయం... ముందు టన్నుల కొద్దీ ఉన్న భయం. సినిమాను తీస్తున్నారు. ఆ సినిమా ఎలా ఉన్నా సరే స్టార్ హీరో ఉన్నాడు కాబట్టి ప్రేక్షకులు చూస్తున్నారు. సరే చూస్తున్నారు బాగానే ఉంది. 

 

మరి సినిమాలో కమర్షియల్ హంగులు తప్పా ప్రయోగాలు చేయలేరా...? తమిళంలో ఒక హీరోకి దర్శకుడు కథ చెప్తే ఆ కథలో ఎలాంటి వైవిధ్యం ఉన్నా సరే అంగీకరిస్తాడు. సినిమా స్టొరీ లో పట్టు ఉండాలి గాని పాత్రతో సంబంధం లేదు. అందుకే చిన్న దర్శకులు కూడా అగ్ర హీరోలతో చాలా మంచి పాత్రలు వేయించారు. కాని మన వాళ్ళు మాత్రం భయపడుతూ హీరో చెప్పినట్టే చెయ్యడం చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక్క రంగస్థలం సినిమా మినహా ఏ ఒక్కటి కూడా వైవిధ్యంగా వచ్చినట్టు కనపడలేదు. దర్శకుడు భయపడితే సినిమా కూడా అలాగే ఏడుస్తుంది అంటున్నారు సినిమా జనం.

మరింత సమాచారం తెలుసుకోండి: