టాలీవుడ్ లో తమదైన ముద్ర వేసిన హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్లు అనుష్క, కాజల్ ముందు వరుసలో ఉంటారు. అంటే దాదాపు పదేళ్ళ నుంచి తీసుకుంటే వాళ్ళు ఇద్దరు మాత్రమే కనపడతారు. ఇతర హీరోయిన్లు సమంతా, సహా మరో ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే వీళ్ళు చాలా మంచి సినిమాలు పెద్ద సినిమాలు చేసారు. దాదాపు అందరు అగ్ర హీరోలతో వీళ్ళు సినిమాలు చేసారు. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు... ఇలా ఆ హీరోహీరో అనే తేడా లేకుండా సినిమాలు చేసారు ఈ ఇద్దరు. 

 

ఇప్పుడు ఇద్దరికీ వయసు 30 దాటి 40 కి దగ్గరలో ఉంది. వాళ్ళతో సినిమా లు చేయడానికి దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తమిళంలో తెలుగులో వాళ్లకు మంచి ఆఫర్లే వస్తున్నాయి. ఒక్కో సినిమా చేయడమో రెండు సినిమాలు చేయడమో చేస్తున్నారు ఈ ఇద్దరూ. అయితే పెళ్లి విషయానికి వస్తే మాత్రం వీళ్ళు వెనకడుగు వేస్తున్నారు. దాదాపు 15 ఏళ్ళ నుంచి టాలీవుడ్ లో వీళ్ళ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి... వదులుకోవడం లేదు ఈ ఇద్దరు. 

 

సినిమాలు చేస్తే అవకాశాలు తగ్గిపోతాయి అనే భావనలో ఉన్నారు ఈ ఇద్దరు. ప్రస్తుతం చేసినన్ని రోజులు సినిమాలు చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు. తర్వాత సంగతి తర్వాత ముందు ఉన్న సినిమాలు చేసుకుని, మనకు డిమాండ్ ఉన్నన్ని రోజులు సినిమా లు చేసి తర్వాత పెళ్లి ఆలోచన చేద్దాం అనే భావన లో ఉన్నారట. అందుకే పాత్ర బాగుండి, సినిమా మంచిది అయితే చేయడానికి ఈ ఇద్దరు సిద్దమవుతున్నారు. వాళ్ళ అంచనా ప్రకారం మరో రెండేళ్ళ పాటు ఈ ఇద్దరికీ అవకాశాలు రావడం దాదాపు ఖాయం. ఆ తర్వాతే ఈ ఇద్దరు పెళ్లి చేసుకునే ఆలోచన చేస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: