టైటిల్ చదివి అమ్మలను తిట్టారు అనుకోవద్దు... అవును ఇప్పుడు సినిమాల్లో ఆంటీలకు మంచి డిమాండ్ ఉంది. అవును అది అక్షరాలా నిజం. పాత తరం హీరోయిన్ల కోసం కొందరు దర్శకులు ప్రత్యేక పాత్రలను డిజైన్ చేస్తున్నారు. అప్పట్లో నటించి ఇప్పుడు అవకాశాలు లేక పిల్లలతో సమయం గడిపేస్తున్న చాలా మంది మాజీ స్టార్ హీరోయిన్లకు ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి. హీరో తల్లిగా, హీరోయిన్ తల్లిగా, హీరో అక్కగా, ప్రొఫెసర్ గా, విలన్ గా, సహాయ నటిగా ఇలా ఎన్నో పాత్రలు వారికి ఉంటున్నాయి. ఈ మధ్య ఈ పాత్రలకు డిమాండ్ పెరిగిపోయింది. 

 

ఒకప్పుడు హీరోయిన్ గా నటించి మెప్పించిన విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమా లో కీలక పాత్ర లో నటించారు. ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం అయింది. ఆమె పాత్రకు మంచి మార్కులే వేసారు ప్రేక్షకులు. ఆ తర్వాత నదియా విషయానికి వస్తే ఆమె ఇప్పుడు తమిళంలో తన వయసుకి తగిన పాత్రలు చేస్తుంది. అక్కడ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో అవకాశాలు వచ్చినప్పుడు హీరోయిన్ కంటే ఎక్కువ అడగడం తో చాల్లే బ్యాగ్ సర్దుకో అన్నారు. ఇప్పుడు అక్కడ చేస్తుంది సినిమాలు. 

 

అదే విధంగా ఖుష్భు  కి కూడా ఈ మధ్య అవకాశాలు వస్తున్నాయి. అలాగే స్నేహా కూడా కొన్ని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె రూలర్ సినిమా లో, గత ఏడాది వచ్చిన వినయ విదేయ రామ సినిమాల్లో కీలక పాత్రలు చేసారు. రమ్యకృష్ణ కూడా కొన్ని కీలక పాత్రలు చేస్తున్నారు. సోలో గా కొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు. ఇలా తమిళంలో తెలుగులో పెళ్లి అయినా, పిల్లలు ఉన్నా సరే వీళ్ళకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక కథలో డిమాండ్ ఉన్న పాత్ర కావడంతో వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: