బన్నీ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా తరువాత కెరీర్ పరంగా కొంత బ్రేక్ తీసుకుని తన మ్యూజిక్ లో చాలావరకు మార్పులు చేర్పులు చేసుకుని, ఆడియన్స్ కి మరింతగా క్వాలిటీ మ్యూజిక్ అందించాలనే తపన, పట్టుదలతో ఎట్టకేలకు మళ్ళి తెలుగు సినిమాలకు సంగీతం అందివ్వడం మొదలెట్టాడు యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్. ఆ తరువాత ఆయన మ్యూజిక్ అందించిన భాగమతి, మహానుభావుడు, తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాల్లోని సాంగ్స్ ఎంతో మంచి రెస్పాన్స్ ని సంపాదించాయి. 
ఇక ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాకు అత్యద్భుతమైన మ్యూజిక్ అందించిన థమన్ కు ప్రస్తుతం టాలీవుడ్ వెల్లువలా అవకాశాలు వచ్చి పడుతున్నాయి.

 

ప్రస్తుతం థమన్ చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం పవన్ నటిస్తున్న లాయర్ సాబ్, అలానే బోయపాటి బాలయ్య సినిమా, ఇక మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమాలతో పాటు పవన్ హరీష్ శంకర్సినిమా కూడా థమన్ చేతికే చేరినట్లు టాక్. మరోవైపు ఇవి మాత్రమే కాక మరికొన్ని సినిమాలు కూడా ఒప్పుకున్న థమన్, కెరీర్ పరంగా ఎన్నడూ లేనంత బిజీబిజీగా ఉన్నాడని అంటున్నారు. 

 

ఒకప్పుడు కాపీ క్యాట్ అనే ముద్ర థమన్ పై బాగా ఉండేది, అది మాత్రమే కాక, ఇచ్చిన ట్యూన్స్ నే రిపీటెడ్ గా ఇస్తున్నాడు అని అన్నవారు కూడా ఉన్నారు. ఇక ఇటీవల కొంత గ్యాప్ తీసుకుని తనని తాను పూర్తిగా మార్చుకుని సంసిద్ధం అయి వచ్చిన థమన్, ప్రస్తుతం ఇస్తున్న సాంగ్స్ కు ప్రేక్షకులు పట్టం కడుతున్నారంటే అది నిజంగా అతడి శ్రమ ఫలితమే అని, ప్రస్తుతం మాత్రమే కాదు రాబోయే రోజుల్లో కూడా మరికొందరు దర్శక, నిర్మాతలు థమన్ సంగీతం కోసం ఎదురుచూస్తున్నారని, ఈ విధంగా చూస్తే అతడి పంట పండినట్లే అని తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: