మొదట టాలీవుడ్ కి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ వర్మ, ఆ తరువాత మెల్లగా తన కామెడీ టైమింగ్ తో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని, కమెడియన్ గా ఎంతో మంచి పేరు గడించాడు. ఆ తరువాత అందాల రాముడు సినిమాతో హీరోగా మారి ఆపై మర్యాద రామన్నతో మంచి సక్సెస్ అందుకున్నాడు. టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఎంతో మంచి మిత్రుడైన సునీల్, దాదాపుగా చాలా వరకు త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీ రోల్స్ లో నటించి మంచి పేరు గడించాడు. 

 

అయితే హీరోగా మారిన తరువాత త్రివిక్రమ్ సినిమాల్లో కూడా నటించడం తగ్గించిన సునీల్, ఇటీవల ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీసిన అరవింద సమేతతో పాటు మొన్న బన్నీ హీరోగా వచ్చిన అలవైకుంఠపురములో కూడా ఒక చిన్న కామెడీ పాత్రలో నటించాడు. ఇక ఇటీవల రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా సినిమాలో విలన్ గా సడన్ ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ని థ్రిల్ చేసిన సునీల్, అతి త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తో తీయబోయే 'అయినను పోయి రావలె హస్తినకు' సినిమాలో కూడా అదే తరహా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించనున్నట్లు టాక్. 

 

అయితే డిస్కో రాజా మాదిరిగా చివర్లో విలన్ గా తేలడం కాకుండా, మొదటి నుండి విలన్ గ్యాంగ్ లో ఒక కీలక వ్యక్తిగా వ్యవహరించే సునీల్, సినిమాలోని కొన్ని కీలక సీన్స్ లో పెర్ఫార్మన్స్ అదరగొట్టే ఛాన్స్ ఉందని, ఆ విధంగా సునీల్ రోల్ ని త్రివిక్రమ్ రాసుకున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, కొంతవరకు ఈ వార్త నిజం అయ్యే అవకాశం ఉందని అంటున్న వారు కూడా ఉన్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: