గతంలో సినిమాలు అంటే ఎక్కువగా కమెడియన్స్ హవా ఎక్కువగా ఉండేది అనేది వాస్తవం. సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ప్రతీ దర్శకుడు కమెడియన్స్ కోసం ప్రత్యేక పాత్రలు డిజైన్ చేయడం వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వంటివి ఎక్కువగా చేసే వారు. దీనితో చాలా మంది భారతీయ సినిమాకు కమెడియన్స్ పరిచయం అయ్యారు అనే చెప్పాలి. ఎందరో అగ్ర కమెడియన్స్ దశాబ్దాల పాటు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. బాలీవుడ్ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ లో ఎందరో కమెడియన్స్ అలరించారు అనేది వాస్తవం. 

 

ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రాజబాబు, రాజనాల, సూర్యకాంతం, రేలంగి, రమణ రెడ్డి, రమ ప్రభ ఇలా ఎందరో నటులు అలరించారు. ఆ తర్వాత బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, కృష్ణ భగవాన్, వేణు మాధవ్, ఏవీఎస్, ఎం ఎస్ నారాయణ, సునీల్ ఇలా ఎందరో నటులు టాలీవుడ్ ని అలరించారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన కమెడియన్స్ మాత్రం టాలీవుడ్ లో కనపడటం లేదనే చెప్పాలి. చిన్న చిన్న నటులు వచ్చి పోతున్నారు గాని ఆ రేంజ్ లో ఎవరూ ఉండటం లేదు. 

 

గతంలో కమెడియన్ అనగానే చూడగానే నవ్వు తెప్పించే పాత్రలు ఉండేవి. కాని ఇప్పుడు అలా లేదు. సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు, కేరెక్టర్ ఆర్టిస్ట్ లే కామెడి చేస్తున్నారు. దర్శకులు కూడా అదే విధంగా ఆలోచిస్తూ వారికి అంటూ ప్రత్యేక పాత్రలు కూడా ఏమీ ఉంచడం లేదు. దీనితో టాలీవుడ్ లో కమెడియన్స్ హవా అనేది బాగా తగ్గింది అనే చెప్పవచ్చు. ఈ మధ్య వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లో హీరోయిన్లు కూడా కామెడి చేస్తున్నారు. వాళ్ళే నవ్విస్తున్నారు అలరిస్తున్నారు. దీనితో దర్శకులు కూడా హీరోలకు హీరోయిన్లకు కామెడి పాత్రలను ఎక్కువగా రాస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు సినీ పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: