ఓవర్ నైట్ అయినా స్టార్.. అని అనగానే మనకు మొదట వినిపించే పేరు ప్రియా ప్రకాష్ వారియర్.. అసలు ఈమె యువతకు పరిచయం అక్కర్లేని పేరిది. కన్నుగీటిన ఒక్క వీడియోతో దేశ వ్యాప్తంగా  ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఒరు ఆధార్ లవ్ చిత్రంలో ఆమె కన్నుగీటిన హావ భావాలు యువత హృదయాల్లో సృష్టించాయి. 

 

ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని పాట విడుదలయ్యే వరకు ప్రియా వారియర్ అంటే అసలు ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఆమె కన్నుగీటిన వీడియో 2018లో యూట్యూబ్ లో ఎంతలా వైరల్ అయిందో అందరికి తెలిసిందే.. యువత నుంచి బడా స్టార్ ల వరకు అంతా ప్రియా వారియర్ ఫ్యాన్స్ గా మారిపోయారు. దీనితో ప్రియ వారియర్ కు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు మొదలయ్యాయి. తన తొలి చిత్రంలో ప్రియా ప్రకాష్ క్యూట్ లుక్స్ తో మాత్రమే ఆకట్టుకుంది. కానీ గ్లామర్ షో అంత పెద్దగా ఏమి చేయలేదు. 

 

అయితే.. ఇప్పుడు ప్రియా వారియర్ కు కమర్షియల్ చిత్రాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. దీనితో ఈ అమ్మడు గ్లామర్ షోలో మెప్పిస్తే ప్రియా వారియర్ కు మరింతగా మైలేజ్ పెరుగుతుందని.. ఈ కేరళ ముద్దుగుమ్మ బాగా అర్ధం చేసుకుంది. నెమ్మ నెమ్మదిగా అందాలు ఆరబోయడానికి సిద్ధం అవుతోంది ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తోంది. 

 

కాగా., తాజాగా ప్రియా వారియర్.. ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని తన కోస్టార్ మహమ్మద్ రోషన్ తో హాట్ ఫోటో షూట్ కు తెరతీసింది. ఈ ఫోటో షూట్ లో వీరిద్దరి కెమిస్ట్రీ నెటిజన్లని ఫిదా చేస్తోంది.

ముఖ్యంగా ప్రియా వారియర్ సెక్సీ లుక్స్ మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. ప్రియా వారియర్ ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన ఓ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకుడుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: