టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పరిస్థితి సినిమా సినిమాకి దారుణంగా దిగజారిపోతుంది. వచ్చిన క్రేజ్ వచ్చినట్టే పోతుంది. అందుకు కారణాలు సాధారణంగా ఎవరైనా సినిమా కథ, కథనాలలో లోపం అంటారు. లేదా దర్శకుడు సినిమాని తెరకెక్కించిన విధానమూ అని కొన్నిసార్లు మాట్లాడుకుంటుంటారు. అయితే ఒక సినిమా ఫ్లాపవడానికి హీరో కారణం అన్న మాట ఇండస్ట్రీలో చాలా తక్కువగా వినిపించే మాట. కానీ విజయ్ విషయంలో అదే వినిపిస్తోంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రిలీజ్ కాకముందే ఫ్యాన్స్ తో పాటు జనాలలోనూ నెగెటివ్ వైబ్రేషన్ నెలకొంది. 

 

సినిమా పట్ల విజయ్ చూపించిన అనాసక్తి, సిక్స్ కొట్టడానికి ట్రై చేసా కానీ సిక్స్ వెళుతుందో, క్యాచ్ పట్టుకొనిఒ అవుట్ అవుతుందో తెలీదు .. అంటూ చేసిన కామెంట్లు ఈ సినిమా పట్ల ఫ్లాపవడానికి సూచనగా అనిపించాయి. అనుకున్న దానికంటే ఇంకా దారుణంగా మొదటి షో నుండే టాక్ రావడం ఆ తర్వాత సాయంత్రానికల్లా సినిమా ఫ్లాప్ అన్న టాక్ గట్టిగా వినిపించడం వరల్డ్ ఫేమస్ లవర్ కి మైనస్ గా మారాయి.

 

మొదటి ఆదివారం వసూళ్లు, మొదటి శనివారం కంటే తక్కువ రావడంతో ఇక ఈ సినిమా డిజాస్టర్ అని కన్‌ఫర్మ్ అయింది. నష్టాల పరంగా చూస్తే ఇప్పటి వరకు విజయ్ నటించిన సినిమాలలో అతి పెద్ద ఫ్లాప్ అయిన సినిమాగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ తో ‘హీరో’ సినిమా అర్ధాంతరంగా ఆపేసి అందుకు అయిన ఖర్చును కూడా కొంత భరిస్తున్నట్లు తెలుస్తుంది.

 

అయితే ఇలా జరగడానికి కారణం దర్శకుల పనిలో తల దూర్చడం, అదే పనిగా అర్జున్‌రెడ్డిని అనుకరించడంతో విజయ్ చేతులారా తన క్రేజ్‌ని పాడు చేసుకున్నాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నాడు. అందుకే విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాథ్‌ని విపరీతంగా నమ్ముతున్నాడు. తన కెరీర్‌ని మళ్ళీ పట్టాలెక్కిస్తాడని ఆశగా ఉన్నాడట. అయితే పూరి మ్యాజిక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: