నాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచికి తగిన సినిమాలు చేస్తున్నాడు. అ! తో సూపర్ హిట్ అందుకున్న నాని తన సెకండ్ మూవీగా హిట్ తో వస్తున్నాడు. యువ హీరో విశ్వక్ సేన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో రుహాని శర్మ హీరోయిన్ గా నటించింది. శైలేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కు చీఫ్ గెస్టులుగా రాజమౌళి, రాఘవేంద్ర రావు, అనుష్క, రానా అటెండ్ అయ్యారు.

 

వీళ్లతో పాటుగా అల్లరి నరేష్, సందీప్ కిషన్, సునీల్, నవదీప్, కార్తికేయ, తరుణ్ భాస్కర్, సుశాంత్ ఇలా యువ హీరోలంతా వరుస కట్టేశారు. కొందరు విశ్వక్ పిలిస్తే వచ్చానని చెప్పగా కొందరు నాని కోసం వచ్చినట్టు చెప్పారు. ఇలా నాని తన సినిమా ఈవెంట్ కు అందరిని పిలవడం నాని మీద అభిమానంతో వాళ్లంతా వచ్చి తన సపోర్ట్ ఇవ్వడం అనేది మంచి విషయం అని చెప్పొచ్చు.

 

ఇండస్ట్రీలో నాని అందరికి ఎంత కావాల్సిన వాడు అన్నది ఈవెంట్ కు వచ్చిన గెస్టులను చూస్తే అర్ధమవుతుంది. విశ్వక్ సేన్ కూడా స్పెషల్ గా రానా, కార్తికేయలను పిలిచాడట. శైలేష్ డైరెక్ట్ చేసిన హిట్ సినిమా డిఫరెంట్ స్టోరీతో వస్తుందట. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్, ట్రైలర్ మాత్రమే కాదు రాజమౌళి చేతుల మీదగా ఒక 3 నిమిషాల స్నీక్ పీక్ రిలీజ్ చేశారు. అది చూసిన రాజమౌళి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని అన్నారు. సినిమా మొదటి టికెట్ కొన్న రాజమౌళి టీం అందరికి బెస్ట్ విశెష్ చెప్పారు. మరి శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: