సినిమా పరిశ్రమకు బాలనటిగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి గురించి మన భారత దేశంలో దాదాపుగా తెలియని వారు ఎవరూ ఉండరు అనే చెప్పాలి. అటు నార్త్ లో బాలీవుడ్ తో పాటు పలు సౌత్ భాషల్లో కూడా ఎన్నో గొప్ప సినిమాల్లో నటించిన శ్రీదేవిఅందం, అభినయానికి అప్పట్లో మాములు అభిమానులు కాదు వీరాభిమానులు ఉండేవారని చెప్పాలి. ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ లోని కొందరు యువ నటులు శ్రీదేవి అంటే ఎంతో ఇష్టం అని, ఆమె తమ అభిమాన ఆరాధ్య దేవత అని చెప్తుంటారంటే, శ్రీదేవికి ఎంత గొప్ప పేరుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక సెట్ కి వచ్చిన తరువాత ఎక్కువగా తన క్యారెక్టర్ పై ఫోకస్ చేస్తూ, షూటింగ్ పూర్తి అయిన తరువాత యూనిట్ సభ్యులను అందరినీ ఎంతో సాదరంగా, ఆప్యాయతతో పలకరించే శ్రీదేవికి అప్పట్లో మరొక హీరోయిన్ తో పెద్దగా పడేది కాదని విమర్శలు వెల్లువెత్తాయి. 

 

అయితే ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల నటి జయప్రద. ఇక శ్రీదేవి మాదిరిగా తన ఆకట్టుకునే అందం, అభినయంతో హీరోయిన్ గా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించిన జయప్రద కు కూడా ఎందరో అభిమానులు ఉండేవారు. అయితే ఇక్కడ ఒక గమ్మత్తయిన విషయం ఏమిటంటే, వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు అప్పట్లో చాలానే ఉన్నప్పటికీ, ఇద్దరికీ పెద్దగా పడేది కాదని వార్తలు వెల్లువెత్తేవట. అయితే ఈ విషయమై ఇటీవల జయప్రద ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, నిజానికి అప్పట్లో శ్రీదేవికి తనకు పడేది కాదనే వార్తలు వెల్లువగా ప్రచారం అయిన మాట వాస్తవమేనని అన్నారు. 

 

అయితే అందులో నిజం ఏమిటంటే, ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఎవరికి వారము కేవలం మా పాత్రల పరిధి వరకు మాత్రమే చర్చించుకునేవారమని, ఇక షూటింగ్ పూర్తి అయ్యాక ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళేవాళ్ళం అని అన్నారు. ఇక షూటింగ్ స్పాట్ మధ్యలో ఆమె వేరొకరితో మాట్లాడుతుంటే, తాను మరొకరితో మాట్లాడేదానినని, అయితే నిజానికి తామిద్దరి మధ్య ఎటువంటి బేధాభిప్రాయాలు లేనప్పటికీ ఎందుకో అప్పట్లో అలా షూటింగ్స్ జరిగిపోయాయని జయప్రద అన్నారు. అంతేతప్ప నిజానికి ఆమెకు నేను, నాకు ఆమె బద్ద శత్రువులం ఏమాత్రం కామని జయప్రద చెప్పడం జరిగింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: