టాలీవుడ్ సినిమా పరిశ్రమకి వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన చలో అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న, ఫస్ట్ మూవీ తో మంచి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత దేవదాసు సినిమాలో నాని తో జోడి కట్టిన ప్పటికీ, ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఆమె నటించిన గీత గోవిందం సినిమా సూపర్ సక్సెస్ కొట్టి యూత్ లో రష్మిక కు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. 

 

ఇటీవల మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి మరో విజయాన్ని అందుకున్న రష్మిక, ప్రస్తుతం బన్నీ సినిమా, అలానే తమిళంలో మరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల నితిన్ తో కలిసి ఆమె నటించిన భీష్మ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ కొట్టింది. అయితే మొదటి నుంచి సెట్స్లో ఉండే వారందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే అలవాటు ఉన్న రష్మిక పై కొద్ది రోజులుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో పలు రకాల ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు కోతి బొమ్మతో కూడిన ఏమోజీ పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

 

ఇప్పుడు అదే ఆమెకు కొంత సమస్యగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే, నిన్న ఒక ఫోటో షూట్ లో పాల్గొన్న రష్మిక, రకరకాల వింత పోజుల్లో ఫోటోలు దిగి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోలపై నిన్నటి నుంచి పలు విధాలుగా మెమేలు, ట్రోల్స్ ని పరిగెత్తిస్తున్నారు నెటిజన్లు. పిచ్చి పిచ్చి ఫోజుల్లో ఆ ఫోటోలేంటి, నువ్వెంటి. నీ కోతి చేష్టలతో చస్తున్నాం తల్లో, హీరోయిన్ అంటే కొంత హుందగా వ్యవహరించాలని, నువ్వు ఇటువంటి వేషాలు ఇంక ఆపు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇంకొందరైతే కమెడియన్ వడివేలు ఫన్నీ ఫోటోలను ఆమె ఫోటోలతో జతచేసి మరింత వైరల్ చేసేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ విధంగా రష్మిక ఫోటోలపై సోషల్ మీడియా మాధ్యమాల్లో నానా రచ్చ జరుగుతుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: