ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ బుల్లితెర ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఇన్ని సీరియల్స్, రియాలిటీ షోలు లేవు కనుక ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా థియేటర్స్ కు వచ్చే వాళ్లు. కాని ఇప్పుడు థియేటర్ కు వెళ్తే ఒక సినిమానే కాని ఇంట్లో కూర్చుంటే రోజుకో సినిమా అనేలా సీరియల్స్ కు అలవాటు పడ్డారు. ఫలానా టైం కు ఫలానా సీరియల్ టైం అవుతుందంటే చాలు రిమోట్ చేతులో పట్టుకుని మరి టివిలకు అతుక్కుపోతారు. 

 

అయితే సీరియల్స్ మెచ్చే మహిళలు కొందరైతే రియాలిటీ షోలు చూస్తూ ఎంజాయ్ చేసే గృహిణిలు ఉన్నారు. ఈటివి లో సీరియల్స్ కన్నా జబర్దస్త్, ఢీ షోలకు ఎక్కువ టి.ఆర్.పి రేటింగులు వస్తున్నాయి. ఇక ఈటివికి పోటీగా జీ తెలుగు సీరియల్స్ లో తన హవా కొనసాగిస్తుంది. ఈటివికి, జీ తెలుగుకి మధ్యలో మా టివి సీరియల్స్ తో సందడి చేస్తున్నా దాని సందడి ఎక్కువగా చూపించేది మాత్రం బిగ్ బాస్ వస్తేనే. బిగ్ బాస్ మూడు సీజన్లలో మూడు సక్సెస్ అయ్యాయి.

 

ఈ మూడు ఛానెల్స్ లో మంచి మంచి సీరియల్స్ తో పాటుగా సరదా సరదా గేం షోస్ కూడా ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ఈటివి జబర్దస్త్ కమెడియన్స్ ను.. జీ తెలుగు అదిరింది షో కమెడియన్స్ తీసుకొచ్చి మా స్టార్ మ్యూజిక్ అంటూ శ్రీముఖి షో చేసింది. సో ఈ షోని చూస్తే మూడు ఛానెల్స్ కవర్ చేసినట్టు అన్నమాట. స్టార్ మాలో ఇస్మార్ట్ జోడీ అంటూ ఓంకార్ మరో కొత్త షో చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన చాలా రకాల షోస్ స్టార్ మాలో చేస్తూ వచ్చారు. సో మొత్తానికి ఏ ఛానెల్ కు ఆ ఛానెల్ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ టి.ఆర్.పి రేటింగ్ అదిరిపోయేలా చేయాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: