విక్టరీ వెంకటేష్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి ఆయన ఏ స్టార్ హీరో తో నైనా సినిమా అంటే మహేష్ ఫ్యాన్స్ తో పాటు మితా ఆడియన్స్ కూడా చటుక్కున నమ్మేస్తున్నారు. ఎందుకంటే సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. దాంతో మహేష్ బాబు మల్టీ స్టారర్ అంటే అందరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. అయితే సూపర్ స్టార్ ఆ రేంజ్ లో మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తారా అని జనాలు ఎదురు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా చిరు 152 సినిమా ఆచార్యలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తారని ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. కానీ ఇందులో నిజమెంత అన్నదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక వాస్తవంగా అయితే చిరు పాత్ర యంగర్ వెర్షన్ లో చరణ్ నటిస్తారని అంటున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉండటంతో రామ్ చరణ్ నటిస్తే, ఆ సినిమా 2021 సమ్మర్ కి షిఫ్ట్ అవుతుంది. లేదంటే చరణ్ డ్రాపవ్వాలి.

 

దాంతో సోషల్ మీడియాలలో చిరు 152 సినిమా మహేష్ బాబు నటిస్తారని బాగా న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ వార్త దాదాపు నిజమని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకొసం కేవలం 25 రోజలు కాల్ షీట్లు ఇవ్వడం, అందుకు మహేష్ కు భారీ రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసినట్టు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమా ఒకే చేశారు మహేష్ బాబు. అయితే ఆ సినిమా కి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో మహేష్సినిమా కమిటవొచ్చునని అంటున్నారు.

 

మహేష్ ఒప్పుకుంటే ఈ సినిమాకి భారీ రెమ్యూనిరేషన్ ను ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇక కొరటాల శివ, చిరు, మహేష్ రెమ్యూనిరేషన్లు ఎంత భారీగా వేసుకున్నా 75 కోట్ల వరకు వుంటాయని అంచనా వేస్తున్నారు. మేకింగ్ కు మరో యాభై వేసుకున్నా 125 కోట్లు అవుతుంది. కానీ మెగాస్టార్-మహేష్ బాబు సినిమా అంటే 150 కోట్ల మేరకు థియేటర్ నాన్ థియేటర్ బిజినెస్ జరుగుతుంది. పాతిక కోట్ల టేబుల్ ప్రాఫిట్ వుండటం పక్కా. ఈ విషయంలో అధికారకంగా ప్రకటన రావాలంటే కొరటాల శివ సన్నిహిత వర్గాల ద్వారా మరో 15రోజుల్లో ఏ విషయం క్లారిటీ వస్తుందని తెలుస్తుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: