ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఎప్పటికప్పుడు సరికొత్త సరికొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న సినిమా ప్రపంచంలో ఎక్కువగా హంగులు, ఆర్భాటాలు, లిప్ కిస్ లు, శృంగార సన్నివేశాలు వంటి వాటికి రాను రాను మరింత ప్రాధాన్యత పెరుగుతోందని, దానివలన నిజంగా కథను నమ్మి సినిమా తీయాలనుకునే వారికి అటువంటి అంశాలు కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాల్లో హీరోయిన్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, ఒక సినిమాలో ఎంతో నాజూగ్గా, అందంగా ఉన్న హీరోయిన్, తదుపరి సినిమాకి ఏ మాత్రం కొద్దిగా ఆమె గ్లామర్ లో గాని, పర్సనాలిటీ లో గాని మార్పు వస్తే చాలు, ఆ హీరోయిన్ ని వెంటనే దర్శకనిర్మాతలు పక్కన పెట్టేస్తున్నారని అంటున్నారు. 

 

దానికి కారణం ఎక్కువ మంది హీరోయిన్లు అందానికి ఇస్తున్న ప్రాధాన్యత అని,అలానే ప్రేక్షకులు కూడా హీరోయిన్ల అందానికి ఇస్తున్న ప్రాధాన్యత అని, దానివలన కొందరు హీరోయిన్లు పడుతున్న పాట్లు వర్ణనాతీతం అని వారంటున్నారు. ఇటీవల కొందరు హీరోయిన్లు తమతో చేసిన వ్యాఖ్యలు వింటే నిజంగా ఎంతో బాధిస్తోంది అని అంటున్నారు. అందరూ ఇక్కడేదో మేము కోట్లు గడిస్తూ ఆనందంగా ఉల్లాసంగా జీవితాన్ని గడిపేస్తున్నాం అని అనుకుంటారు. 

 

అయితే ఒకసారి సినిమా పరిశ్రమకు వచ్చాక, ఇక్కడ మేం పడే బాధలు మాకు మాత్రమే తెలుసు అని, ఒకరకంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే తమ గ్లామర్ ని ఎప్పటికప్పుడు కాపాడుకోవడానికి, ఛీ,ఛీ కనీసం కడుపునిండా పట్టెడు అన్నం కూడా తినలేని నీచమైన పరిస్థితుల్లో తాము ఉన్నామని, ఇక వాటి స్థానంలో నానా గడ్డి గాదం వంటివి తినవలసిన పరిస్థితులు ఉన్నాయని, అలానే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎప్పటికప్పుడు తప్పకుండా యోగ, వ్యాయామం వంటివి చేసి తీరాలని వాపోయారట. నిజంగా ఇటువంటి పరిస్థితులు పగవాడికి కూడా వద్దు అని వారు అంటున్నట్లు సమాచారం. అయితే సినిమా ఫీల్డ్ కు వచ్చి మంచి పేరు ప్రఖ్యాతలు, హోదా, ధనం వంటివి ఆర్జించాలి అంటే అంటే మాత్రం ఇటువంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొనక తప్పదని వారు అభిప్రాయపడ్డారట.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: