సాధారణంగా ఏ సెలబ్రిటీస్ అయినా తమని తాము ప్రమోట్ చేసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఏ చిన్న ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తామన్నా వెంటనే సరే అంటూ ముందుకొస్తారు. వాస్తవగా చెప్పాలంటే కాస్త డబ్బు ఉన్న చాలా మంది ప్రత్యేకంగా సినిమా సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూస్ చేసి తమ యూటూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తే బాగా సంపాదన వస్తుందన్న ఆలోచనతో వ్యాపారపరమైన ధోరణతో ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళే. ఇక బుల్లి తెర ఫేమస్ యాంకర్ సుమ కనకాల, లాగే మెగా బ్రదర్ నాగ బాబు, సీనియర్ రచయిత పరుచూ గారు ఇలా చాలామంది స్టార్ సెలబ్రిటీస్ నుంచి మంచి బిజినెస్ రన్ చేస్తున్న బడా బాబులు సైడ్ బిజినెస్ గా ఈ యూట్యూబ్ ఛానల్ ని పెట్టి బాగా సంపాదిస్తున్నారు. 

 

స్టార్స్ వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వకపోయినా చిన్న తరహా, ఒక మాదిరి నటీ నటులను ఇంటర్వ్యూస్ చేసి బాగా పాపులర్ అయిన యూట్యూబ్ ఛానల్స్ బాగానే ఉన్నాయి. వాటిలో ఒక శాటిలట్ ఛానల్ లెవల్లో నడుస్తున్న ఐ డ్రీం మీడియా, తెలుగు వన్, సుమన్ టీవీ ...ఇలా కొన్ని బాగా ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఛానల్స్ ని చూసి చాలామంది చాలా యూట్యూబ్ ఛానల్స్ ని పెట్టుకున్నారు. సంవత్సరం క్రితం వరకు ఈ యూట్యూబ్ ఛానల్స్ బాగా రన్ అయ్యాయి కూడా.

 

అయితే ఎప్పుడైతే శ్రీ రెడ్డి ఇష్యూ మొదలైందో కొన్ని నెలలపాటు అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఇండస్ట్రీ గురించే రచ్చ జరిగింది. ఎవరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళిన కాస్టింగ్ కౌచ్ మీదే గంట ప్రోగ్రాం చేసే వాళ్ళు. యాంకర్ దొరికిందే అదునుగా మరీ పచ్చిగా నటులను ప్రశ్నలు వేసి వేధించారు. దాంతో ఇండస్ట్రీలో వాళ్ళు ఇక ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వొద్దని నిబంధన విధించారు. ఆ దెబ్బతో సినిమా వాళ్ళు ఏ యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇవ్వడ లేదు. పిలిచినా రావడం లేదు. వచ్చిన స్పైసీ కంటెంట్ గురించి మాట్లాడటం లేదు.

 

దాంతో ఇప్పటికే చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ మూత పడ్డాయి. ఇక కేవలం యూట్యూబ్ ఛానల్ మీదే ఆదాయం వస్తుందని నమ్మి పెట్టిన వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కొందరైతే ఇదంతా శ్రీ రెడ్డి వల్లే అని వాపోతున్నారట. అంతేకాదు తనని ఏదైనా అంటే మళ్ళీ వాళ్ళ మీద ఎక్కడ వచ్చి పడుతుందోనని భయపడి చస్తున్నారట. మొత్తానికి శ్రీరెడ్డి సినిమా వాళ్ళనే కాదు ఇలా వ్యాపార పరంగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ కి చమటలు పట్టిస్తోందనమాట.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: