కోట అని ఇండస్ట్రీ మొత్తం ముద్దుగా పిలుచుకుంటున్న కోట శ్రీనివాసరావు 1945, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు కోట స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2015 లో కోట కి భారత ప్రభుత్వము నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 

 

చిన్నతనం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో ఎంటరయ్యో సమయానికి రంగస్థలముపై 20 యేళ్ళ అనుభవం సంపాదించారు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తున్న సమయంలో ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు. 'అహ నా పెళ్ళంట' సినిమాలో హీరోయిన్ కి తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది.

 

"ఈడెవడండి బాబూ.., నాకేంటి ..మరి నాకేంటి..., మరదేనమ్మా నా స్పెషల్..., అయ్య నరకాసుర....అంటే నాన్నా అది" ..అనే డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో కోట నటుడిగా చాలా సీనియర్ అన్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాదు ఇప్పటి వరకు ఆయన నటించినన్ని పాత్రలు అతి కొద్ది మంది నటులు మాత్రమే పోషించారు. ఇక విలక్షణ నటుడిగా కోట కి ఉన్న పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మరే నటుడికీ లేదనడంలో అతిశయోక్తి కాదు. ఇక కోట హవా తగ్గిందంటే అందుకు కారణం ప్రకాశ్ రాజ్ అన్న మాట అప్పట్లో ఇండస్ట్రీలో బాగా వినిపించింది. ఆ తర్వాతే కోట శ్రీనివాస్ గారికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయన్న భావన కోట లోను గట్టిగా ఉంది. 

 

ఇక యావత్ ప్రపంచం గొప్పగా చెప్పుకునే బాహుబలి ఫ్రాంచైజీని ఒక్క కోట శ్రీనివాస్ గారు మాత్రం.. "అసలేముంది ఆ సినిమాలో ఇలాంటివన్నీ 1970 లోనే చేశారు. పరమ చెత్త సినిమా" .. అంటూ కామెంట్ చేశారు. ఇక ప్రస్తుతం కోట పరిస్థితి కదలలేనంత దారుణంగా ఉంది. సినిమాలు ఎవరూ ఇవ్వడంలేదు. ఇంత సీనియర్ నటుడైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీ. ఇది ఆయనకి పెద్ద మనోవేదన. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్న నటించడానికి సిద్దంగా ఉన్నానని కళామతల్లి మీద ప్రేమను చాటుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: