మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమాలో బాగా ఫేమస్ అయిన సాంగ్ 'సామజవరగమన'. కేవలం ఈ సాంగ్ మేకింగ్ కే 25 లక్షలు ఖర్చు చేశారు. ఆ రిజల్ట్ కనిపించింది కూడా. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక గొప్ప ప్రయోగం. ఇప్పటివరకు ఇంత ఖర్చు పెట్టి సాంగ్ మేకింగ్ ని రూపొందించలేదు. ఈ సాంగ్ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసినప్పుడు అంతా అవాక్కవుతూ మరీ అతిగా లేదా అన్నారు. కానీ సాంగ్ సూపర్ డూపర్ హిట్టయి లేదు అని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఈ సాంగ్ ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న "సామజవరగమన" అన్న పాటే.  అయితే చాలా మందికి "సామజవరగమన" అంటే అసలు అర్థం ఏంటో తెలీదు. ఇదే అసలు "సామజవరగమన" అంటే.

 

'సామజవరగమన' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది...'సామజ' అనగా "ఏనుగు" అని అర్థం..'వరగమనా' అనగా "చక్కని నడక" అని అర్థం...అలానే ఈ సామవేదం అనగా సంగీతం..  మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం. "సామజవరగమన" అంటే  ఏనుగు లా గంభీరంగా, హుందాగా,ఠీవిగా నడిచేవారు అని అర్థం.

 

ఇక అసలైన "సామజవరగమన"  ఎవరో తెలుసా??... అసలైన "సామజవరగమన.. "శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు. వాల్మీకి తన రామాయణం లో ‘అరణ్యవాసం’లో ఒకచోట రాముడిని “గజవిక్రాంతగమను”డు అంటారు. అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని దాని అర్థం. ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు వారు తన కీర్తనలో 'సామజవరగమన' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు.

 

చాలా మంది పిల్లలకు "సామజవరగమన" అంటూ ధారాళంగా పడేస్తున్నారు....కానీ పాపం వారికి అసలు ఇది దేవుని కీర్తన అని కూడా తెలీదు.. దాని అర్థం ఏంటో తెలీదు...వారికి చెప్పడానికైనా "సామజవరగమన" కీర్తన, దాని అర్థం ఏంటో చెప్పాలి.

కీర్తన...

సామజవరగమనా! సాధుహృత్సారసాబ్జపాల! కాలాతీతవిఖ్యాత! ॥ సామజ॥
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల! దయాలవాల! మాంపాలయ! ॥సామజ॥
వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత యాదవకులమురళీ!
గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥సామజ॥
కీర్తన త్యాగరాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది.. ఈ కీర్తనలోని ప్రతి పదం  శ్రీ కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది...కానీ సినిమాలోని సాంగ్ లో పూజా హెగ్డేని వర్ణించారు.

 

ఈ కీర్తనకి అర్థం ఇదే... ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనుషులు హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు.. సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి.


సామవేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళీ గానం తో మాఅందరిని ఆనంద పరుస్తూ.. ఈ త్యాగరాజ వందనములను అందుకో.. అని అర్థం. ఈ  "సామజవరగమన" పాటను మన మాటల మాంత్రీకుడు పక్కా కమర్షియల్ పంథాలో ఫారిన్ లో అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించి అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: