నితిన్ న‌టించిన అప్‌క‌మింగ్ ఫిల్మ్ హార్ట్ఎటాక్ మూవీకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ వ‌చ్చింది. ఈ మూవీను ఈ రోజు సెన్సార్‌కు పంపించ‌గా హార్ట్ఎటాక్ మూవీకు కొన్ని క‌టింగ్స్ ప‌డ్డాయ‌ని సెన్సార్ రిపోర్ట్ నుండి అందిన స‌మాచారాం. ఎపిహెరాల్డ్‌.కామ్‌కి అందిన స‌మాచారాం మేర‌కు హార్ట్ఎటాక్ మూవీకు ఎ స‌ర్టిఫికేట్ ల‌భించింది. ఈ మూవీ ప్యామిలి ఓరియంటెడ్ ప్రేమా క‌థా చిత్రంగా తెర‌కెక్కించిన పూరిజ‌గ‌న్నాద్‌, హార్ట్ఎటాక్ మూవీకు 'యు బై ఎ' స‌ర్టిఫికేట్ వ‌స్తుంద‌ని ఆశించాడు. కాని సెన్సార్ రిపోర్ట్ జ‌రిగిన ఈ మూవీలో కొన్ని అస‌భ్యక‌ర‌ ప‌ద‌జాలం ఉన్నట్టు, అలాగే కొన్ని సీన్స్‌కు సెన్సార్ క‌టింగ్ ప‌డినట్టు రిపోర్ట్ చెబుతుంది. హార్ట్ ఎటాక్ మూవీ మొత్తంలో 8 క‌టింగ్‌లు, ఏడు మాట‌ల‌కు బీప్ సౌండ్స్ ప‌డిన‌ట్టు టాలీవుడ్ నుండి అందిన స‌మాచారం. హీరోయిన్‌, హీరోను ఉద్దేశించి చెబుతున్న డైలాగ్‌లో మూడు బీప్ సౌండ్స్ ప‌డ్డాయ‌ని సెన్సార్ రిపోర్ట్‌. అలాగే పాట‌లోని అస‌భ్య చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన రెండు షాట్‌ల‌కు బ్లర్‌కి అనుమ‌తించిన‌ట్టు రిపోర్ట్ చెబుతుది. మొత్తానికి హార్ట్‌టార్ మూవీ జ‌న‌వరి 31న రిలీజ్‌కు సిద్ధమైంది. రిలీజ్‌కు సంబంధించిన పోస్టర్స్‌ను సైతం రిలీజ్ చేశారు. ఈ మూవీపై డైరెక్టర్ పూరిజ‌గ‌న్నాధ్‌తో పాటు నితిన్ కూడ‌ భారీగానే ఆశ‌లు పెట్టుకున్నాడు. మూవీ శాటిలైట్ రైట్స్ సైతం ఆశించినంత కంటే ఎక్కువుకే అమ్ముడ‌వ‌టంతో పూరీ జ‌గ‌న్నాద్ సంతోషంలో ఉన్నాడు. అలాగే హీరోయిన్ ఆదాశ‌ర్మ సైతం హార్ట్ఎటాక్ మూవీ స‌క్సెస్‌పై ఆశ‌లు పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: