అవునండి.. రాజమౌళిపై ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు రెండు పోలీస్ కేసులు పెట్టరట.. అయితే మనకు తెలిసిన పోలీస్ స్టేషన్ లో కాదు.. యాంకర్ సుమ కనకాలకు తెలిసిన చోటా పోలీస్ కేసు పెట్టారట.. ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యారా? అవ్వండి పర్లేదు.. ఎందుకంటే రాజమౌళి నమోదైన రెండు కేసులు సుమ ఊహించిన దొంగ కేసులే.. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న ''ఫలక్‌నుమాదాస్‌'' సినిమా ఫేమ్‌ విశ్వక్‌ సేన్‌, రుహానీ శర్మ జోడిగా నటించిన 'హిట్' అనే సినిమా ప్రీరిలీజ్‌ వేడుక అట్టహాసంగా జరిగింది.. అయితే ఈ వేడుకకు దర్శక ధీరుడు జక్కన్న.. రాజమౌళి.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. రానా ఇలా ఎంతోమంది హాజరయ్యారు.. 

 

 

అయితే ఈ ఫ్రీ రిలీజ్ వేడుకకు సుమ యాంకర్ గా వ్యవహరించారు.. అప్పుడే యాంకర్ సుమ తనదైన శైలిలో రాజమౌళితో కామెడీ చేశారు.. ఆ కామెడీని చూసి అక్కడకి వచ్చిన అభిమానులు అంత కేకలు వేశారు అంటే నమ్మండి.. అంత కామెడీ జరిగేలా సుమ ఏం మాట్లాడింది అని అనుకుంటున్నారా? అదే చుడండి.. 

 

సుమ.. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రశ్నలు వేస్తూ.. ముగ్గురు కో-డైరెక్టర్‌లు ఇద్దరు అసిస్టెంట్‌ డైరెక్టర్ల సతీమణులు మీపై కేసులు నమోదు చేశారు? సినిమా ఎప్పుడు అవుతుందోనని వారు భయాన్ని వ్యక్తం చేశారు.. 

 

రాజమౌళి.. కో-డైరెక్టర్ల భార్యలే ఫిర్యాదు చేశారా, హీరోల అభిమానులు ఫిర్యాదు చేయలేదా అని ప్రశ్నించారు.

 

సుమ.. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్‌ నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయి. మా హీరోలు మీ వద్ద ఉన్నారు.. ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు సామి అంటూ ఫిర్యాదు చేశారు.. రిలీజ్ డేట్ చెప్తే తప్ప కేసు క్లోజ్ చెయ్యొద్దు అని అన్నారు. 

 

 

రాజమౌళి.. సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. 2021 జనవరి 8న విడుదల అవుతుంది. 

 

సుమ.. ప్రతి సినిమా హిట్‌ చేస్తున్నారని కొందరూ కేసులు పెట్టారు. దీనికి ఫార్ములా ఎంటని అడుగుతున్నారు. 

 

రాజమౌళి.. ఇలాంటి కేసులన్నీ మీరు తీసుకోకూడదు. ఎఫ్‌ఐఆర్‌ చేయకుడదని అంటూ చిరునవ్వు నవ్వి ఆ కామెడీ సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టారు. 

 

ఈ సంబాషణతో ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంతా నవ్వులతో నిండిపోయింది.. కాగా ఈ సంభాషణ అనంతర రాజమౌళి మాట్లాడుతూ.. ''హిట్ సినిమా టీజర్‌, ట్రైలర్‌ అన్నీ బాగా ఉన్నాయి. స్నీక్‌పీక్‌ అనే ఆలోచన బాగా నచ్చింది. సినిమాలో కీలకమైన సీన్స్ ముందే రిలీజ్ చేయడాన్ని స్నీక్‌పీక్‌ అంటారు. 2012 ఇంగ్లిష్‌ సినిమాలో ఇలా చేశారు. తొలిసారిగా తెలుగులో 'హిట్‌' సినిమాలో ఆ ధైర్యం చేశారు''. అని చెప్పారు. ఈ హిట్ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని సినీ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

 

Image result for hit movie

 

కాగా ఈ హిట్ సినిమాను వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌లో న్యాచురల్ స్టార్‌ నాని నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌, ట్రైలర్‌లకు మంచి స్పందన వచ్చింది.. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 28న విడుదల అవ్వనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: