స్టార్ కాంబినేషన్ సినిమాలంటే అభిమానులకు పండుగే. ముఖ్యంగా ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. రాజమౌళి వల్ల యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో చరణ్, తారక్ ఇద్దరు స్క్రీన్ పై కనిపించే ఆ సన్నివేశం తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక అలాంటి మరో పయత్నమే మరో సినిమాకు జరుగుతుందని తెలుస్తుంది. 

 

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా సెట్స్ మీద ఉంది. కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ ఓ చిన్న రోల్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మెగాస్టార్, సూపర్ స్టార్ ఇద్దరు తెర మీద కనిపిస్తే మాత్రం సంచలనాలే అని చెప్పొచ్చు. కొరటాల శివతో మహేష్ కు మంచి రిలేషన్ ఉంది. ఆయన డైరక్షన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమా చేశాడు మహేష్. రెండు సినిమాలు మంచి ఫలితాన్ని సాధించాయి. ఆ ర్యాపోతోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఓ చిన్న కెమియో రోల్ అడుగుతున్నాడట కొరటాల శివ.

 

చిరు సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. టైం వచ్చినప్పుడల్లా చిరు మీద తన అభిమానాన్ని చూపించే మహేష్సినిమా ఛాన్స్ వస్తే కనుక కచ్చితంగా యెస్ అనేస్తాడు. అదే జరిగితే మాత్రం చిరు సినిమాను మెగా ఫ్యాన్స్ తో పాటుగా ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. రీసెంట్ గా మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కు మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. మెగా సూపర్ ఈవెంట్ సూపర్ సక్సెస్ కాగా చిరు రాకతో ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: