సినిమా అంటే పిచ్చి ఉన్న నటులు కొందరే ఉంటారు. చాలా మంది సినిమాల్లో నటించవచ్చు. కాని సినిమా మీద ప్రాణం పెట్టే నటులు చాలా అరుదు. ప్రేక్షకుడికి ఎం కావాలో... తనను ఆదరిస్తున్న సినిమాకు ఎం కావాలో ఇవ్వాలి అనే పట్టుదలతో ఉండే నటులు ఎక్కడో గాని కనపడరు. కొంత మంది ప్రతిభ ఉండి వెనకడుగు వేస్తే మరికొందరు ప్రతిభ లేక వెనకడుగు వేస్తారు. అన్నీ ఉన్న వాళ్ళు సినిమా మీద ప్రాణం పెట్టడానికి చూస్తారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అందుకోసం ఎంతైనా కష్టపడతారు. 

 

వారిలో అందాల తార, దివంగత శ్రీదేవి ముందు వరుసలో ఉంటారు. ఆమె తన వరకు వచ్చిన ఏ సినిమాను వదిలేవారు కాదు. ఇలాగే 1982 లో ఒకే ఏడాది 18 సినిమాలు చేసారు. ఒక్క తెలుగులోనే ఆమె 14 సినిమాలు చేయడం విశేషం. అందగాడు (1982), ఆదివిష్ణులు (1982), అనురాగ దేవత (1982), బంగారు భూమి (1982), బంగారు కానుక(1982), బంగారు కొడుకు (1982), బొబ్బిలి పులి (1982), దేవత (1982), జస్టిస్ చౌదరి(1982), కలవారి సంసారం (1982), కృష్ణార్జునులు(1982), కృష్ణావతారమ్ (1982), 

 

షంషేర్ శంకర్ (1982), వయ్యారి భామలు వగలమారి భర్తలు(1982), దేవియిన్ తిరివిలైయదాల్ (1982), థనికట్టు రాజా (1982), పొక్కిరి రాజా (1982) (148 రోజులు ప్రదర్శింప బడింది), వాజ్వే మాయం (1982) (200 రోజులు ప్రదర్శింపబడింది) హిందీ లో ఆమె మరో సినిమా చేసారు. ఇలా ఒకే ఏడాది దాదాపు ఆమె 20 సినిమాల వరకు చేసారు. ఈ సినిమాల్లో ఎక్కువగా హిట్ అయినవే. దేవత, జస్టీస్ చౌదరి, బొబ్బిలి పులి సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇలా సినిమా మీద తనకు ఉన్న మమకారాన్ని ఆమె చాటుకున్నారు. ఇలా ఆమెకు సినిమా మీద ఉన్న పిచ్చే అంతటి నటిని చేసింది అంటారు అభిమానులు

మరింత సమాచారం తెలుసుకోండి: