అందాల తార.. అతిలోక సుందరి. అందానికి అసూయా పుట్టించే అందం ఆమెది. ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటే ఆమెను బాగా ఇబ్బంది పెట్టిన సినిమా ఏంటో? ఎందుకు ఇబ్బంది పెట్టిందో తెలుసుకుందాం. 

 

సహజనటి అయిన శ్రీదేవి సినిమాలు ఎంత అద్బుతంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి ఎందరో మనసులను సొంతం చేసుకుంది. తమిళ్, తెలుగు, హిందీ తేడా లేకుండా సినిమాల్లో నటించింది.. ఇంకా తమిళ్ సినిమాల్లో అయితే ఆమె నటన అద్భుతం అనే చెప్పాలి. 

 

తమిళ్ సినిమాల్లో చాలా సహజసిద్ధంగా నటించేది. ఇంకా తెలుగులో కూడా దాదాపు అలానే సహజంగా నటించేది.. అలాంటి సహజనటి శ్రీదేవి బాలీవుడ్ విషయానికి వచ్చేసరికి పూర్తి విరుద్ధంగా నటించేవారని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. శ్రీదేవి 1983 లో బాలీవుడ్ తెరకు పరిచయం అయ్యింది.. అక్కడ హిమ్మత్ వాలా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 

 

అయితే ఆ సినిమాలో శ్రీదేవి ని ఎంతో అందగా చూపించారు.. ఆమె నటించిన ఆ మొదటి సినిమానే అక్కడ కమర్షియల్ గా హిట్ కొట్టింది.. దీంతో శ్రీదేవిని అక్కడ కమర్షియల్ సినిమాల్లోనే ఆమెను ఎక్కువ తీసుకున్నారట. అయితే అక్కడ శ్రీదేవి ఓ సినిమాలో డిగ్లామర్ పాత్రలో సినిమా చేశారు. 

 

సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఆమెను అప్పటి నుండి గ్లామర్ రోల్స్ లోనే దర్శకులు చూపించేవారట.. అందుకే ఇంకా అక్కడ తీసిన సినిమాలు అన్ని కూడా నటనకు స్కోప్ ఉండే సినిమాలకంటే గ్లామర్ కు స్కోప్ ఉండే సినిమాలే ఎక్కువ చేసారు అని.. అది తనను చాలా ఇబ్బంది పెట్టాయి అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: