వరుస సినిమాలతో సూపర్ ఫాం లో ఉన్న నాని ప్రస్తుతం వి సినిమా చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న 'V' సినిమాలో నాని నెగటివ్ షేడ్స్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ డైరక్షన్ లో ఓ సినిమా లైన్ లో పెట్టాడు. టక్ జగదీష్ అంటూ ఈమధ్యనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక ఈరోజు నాని బర్త్ డే సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నానితో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆ బిగ్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట.  

 

టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో నాని సినిమానే ఈరోజు సాయంత్రం ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. అంతేకాదు సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వస్తుందట. సినిమాపై ఆసక్తి కలిగించేందుకు ఓ చిన్న వీడియో కూడా నాని ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సో ఒక సినిమా ఇన్ని సర్ ప్రైజులా అని మీరు అనుకోవచ్చు. సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ తర్వాత మీరంతా షాక్ అవుతారని అంటున్నారు. ఎప్పుడు కొత్త కథలతో సినిమాలు చేస్తున్న నాని ఓ పక్క హీరోగా చేస్తూ నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు.  

 

నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా హిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 28న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఈవెంట్ ఆదివారం సాయంత్రం భారీ రేంజ్ లో జరిగింది. రాజమౌళి, రాఘవేంద్ర రావు, రానా, అనుష్కతో పాటుగా నాని పిలిచిన యంగ్ హీరోస్ అంతా ఈవెంట్ కు వచ్చారు. నాని పిలవాలే కాని ఇలా వాలిపోతాం అంటున్నారు. అనుకున్నట్టుగానే హిట్ ఈవెంట్ సూపర్ హిట్ అయ్యింది. వచ్చిన వారంతా హిట్ తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: