భారతీయ చలన చిత్రరంగంలో  అతిలోక సుందరిగా పేరు  తెచ్చుకుంది నటి శ్రీదేవి.  తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అందము,అభినయం,నటన శ్రీదేవి నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించింది. ఈమె తమిళనాడు లోని శివకాశిలో జన్మించింది. శ్రీదేవి తన నటనా జీవితాన్ని బాల నటిగా కన్దన్ కరుణై (1967) మూవీతో వెండితెరకు పరిచయం అయ్యింది.   తెలుగులో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తర్వాత పదహారేళ్ల వయసు సినిమా తర్వాత హీరోయిన్ గా మారింది.  అప్పటి నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.   ఎన్.టి.రామారావు   తో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి మొదలగు సినిమాలో నటించారు. 

 

అక్కినేని  నాగేశ్వరరావు  తో   ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక మొదలగు సినిమాల్లో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ తో  కంచుకాగడా, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు సినిమాల్లో నటించింది.  శోభన్ బాబు తో కూడా దేవత  సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి మొదటి తరం.. కృష్ణ, శోభన్ బాబు లాంటి రెండో తరం తో నటించిన శ్రీదేవి, తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి మూడో తరం హీరోలతో కూడా కలిసిన నటించిన ఘనత శ్రీదేవికే దక్కింది.  చిత్రం ఏంటంటే ఆమె ఆనాటి హీరోలతో ఎలా ఉందో.. మూడో తరం హీరోలో కూడా అలాగే యవ్వనంగా కనిపించింది. 

 

ఎలాంటి హీరో పక్కన అయినా శ్రీదేవి తన స్టైల్లో నటించి మెప్పించింది.  ఇక బాలీవుడ్ పయణం అయ్యాక యాష్ చోప్రా ఆమెతో "చాందిని" మూవీ తరువాత "లమ్హే" (1991) సినిమా రూపొందించారు. ఈ మూవీకి గానూ ఆమె రెండవ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు, ఇంకా అంతర్జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. "ఖుదా గవా" మరియు "గుమ్రా" మూవీల తో ఎంతో మంది హృదయాలను దోచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: