భారతీయ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తో పాటు చెరగని ముద్ర వేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారిలో అతిలోక సుందరి శ్రీదేవి ముందు వరుసలో ఉంటారు. ఏ స్టార్ హీరో కి రాని ఇమేజ్ అతి తక్కువ కాలంలో ఆమెకు వచ్చింది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని చిర స్థాయిగా నిలిచింది. అయితే శ్రీదేవి వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఇబ్బందులను చూసింది. అన్ని భాషల్లో అందరి హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేసిన శ్రీదేవి, వ్యక్తిగా జీవితంలో మాత్రం ఎన్నో అవస్థలు పడ్డారు. 

 

శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మకు సినీ నటి కావాలన్న తపన ఉండటంతో... ఆమె నటిగా ప్రయత్నిస్తూ రంగారావు అనే చిన్నస్థాయి నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు సూర్యకళ అనే కుమార్తె పుట్టింది. ఆ తర్వాత రంగారావు హఠాత్తుగా కనపడకుండా పోయారు. అప్పటి నుంచి ఆయన కోసం ఎంతో వెతికినా రాజేశ్వరి... ఆచూకి లభించకపోవడంతో... శివకాశికి చెందిన తెలుగువాడు అయ్యప్పన్‌ రెడ్డిని వివాహం చేసుకున్నారు. సూర్యకళను అమ్మమ్మ, తాతయ్యలు తెచ్చి పెంచుకున్నారు. అప్పటికే అయ్యప్పన్‌రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. 

 

అయ్యప్పన్‌రెడ్డి చెన్నైలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసేవారు. ఆయన తన భార్యను ఒప్పించి రాజేశ్వరమ్మ ను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు పుట్టారు. శ్రీదేవి పెద్ద కుమార్తె రెండో కుమార్తె, శ్రీలత. అయ్యప్పన్‌ రెడ్డి మరణించిన తర్వాత, ఆయన కుమారుడు ఇంటి వ్యవహారాలు చక్కబెట్టే వారు. శ్రీదేవి దక్షిణాదిన ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో తన అన్న మాటను దాటే వారు కాదు. ఆయన చెప్పినట్టే నడుచుకునే వారు. శ్రీదేవిని పసి బిడ్డగా ఉన్నప్పటి నుంచి పిన్ని అనసూయమ్మే పెంచింది. ఇప్పుడు ఆమె తిరుపతి లోనే ఉన్నారు. శ్రీలత ను మధురై కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంజీవ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: