టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో వెలిగిపోయింది నటి శ్రీదేవి.  బాలనటిగా సినీ ప్రస్థానం మొదలు పెట్టిన శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించి అందరిచే షభాష్ అనిపించుకుంది.  తెలుగు లో పదహారేళ్ల వయసు సినిమా లో ఆమె అందాలకు దర్శక, నిర్మాతలు ఫిదా అయ్యారు.  తెలుగు లో అప్పటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లకు సరిజోడిగా నటించి స్టార్ హీరోయిన్ గా మంచి  క్రేజ్ తెచ్చుకుంది.  తమిళ్ లోకి అడుగు పెట్టి కమల్ హాసన్, రజినీకాంత్ లతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.  తెలుగు, తమిళ్ లో నెంబర్ వన్ పొజీషన్ లోకి వెళ్లిన సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

 

1978 లో, శ్రీదేవి మొదటి హింది మూవీ "సోల్వా సావన్" అమోల్ పాలేకర్ తో కలిసి నటించారు, ఆ మూవీ విజయవంతం కాలేదు. కాని, తర్వాత జితేంద్ర గారితో కలిసి నటించిన  "హిమ్మత్వాలా" సూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత మిథున్ చక్రవర్తితో కలిసి నటించిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి.  ఇలా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతూ వచ్చింది.  అదే సమయంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.  అయితే అప్పుడప్పుడు ఒకటీ రెండు తెలుగు, తమిళ్ లో నటించే ఆమె వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పింది.  ఈ జంటకు జాహ్నవి, ఖుషీ కపూర్ లు జన్మించారు. 

 

 అయితే శ్రీదేవికి తన కూతుళ్లను హీరోయిన్లుగా చూడాలని కోరిక ఉండేదట.  అందుకోసం ఆమె మళ్లీ ముఖానికి రంగు వేసుకుంది.  ఇంగ్లీష్ వింగ్లీష్ తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది .  అదే సమయంలో తన కూతురు జాహ్నవి ని కూడా హీరోయిన్ గా మార్చేందుకు రంగం సిద్దం చేసింది. ధడక్ సినిమాతో జాహ్నవి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  కాకపోతే ఆ సినిమా రిలీజ్ అయ్యేనాటికి శ్రీదేవి దుబాయ్ లో కన్నుమూశారు.  ఎన్నో ఆశలతో తన కూతురుని హిరోయిన్ గా చూడాలన్న ఆమె కోరిక తీరకుండానే మృత్యువడిలోకి వెళ్లింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: