ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ తన నెక్స్ట్ సినిమా విజయ్ దేవరకొండతో మొదలుపెట్టాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. మాములుగా పూరి సినిమాలో హీరో అంటే రొడీలా బిహేవ్ చేస్తాడు. అయితే ఇప్పుడు అలాంటి ఇమేజ్ తోనే క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండతో పూరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పెళ్లిచూపులు నుండి డియర్ కామ్రేడ్ వరకు నటన విషయంలో అదరగొడుతున్న విజయ్ దేవరకొండకు పర్ఫెక్ట్ స్టార్ డైరక్టర్ ఫిక్స్ అయ్యాడు.   

 

పూరి, విజయ్ కాంబో మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ఫైటర్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. పూరి ఫైటర్ గా విజయ్ ను ఎలా చూపించనున్నాడో చూడాలి. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నా ఒకవేళ తేడా వస్తే మాత్రం కెరియర్ లో విజయ్ చాలా రిస్క్ లో పడతాడని చెప్పొచ్చు. సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఫైటర్ గా విజయ్ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

 

టాక్సీవాలా వరకు హిట్స్ కొట్టిన విజయ్ తన మీద పెరిగిపోయిన అంచనాలతో డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో మాత్రం నిరాశపరుస్తున్నాడు. ఈ సినిమాల ఫలితాలు విజయ్ కెరియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు విజయ్ కెరియర్ మళ్లీ ట్రాక్ ఎక్కాలంటే ఫైటర్ సినిమా తప్పనిసరిగా హిట్ అవ్వాల్సిందే. మరి పూరి చేతుల్లో పడ్డ విజయ్ ఈ సినిమాను ఎలాంటి సినిమాగా నిలిచేలా చేస్తాడో చూడాలి. కరణ్ జోహార్ ఒక నిర్మాతగా ఉంటున్నాడు అంటే సినిమా కచ్చితంగా డిఫరెంట్ గా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: