శ్రీ‌దేవి ఎంత పెద్ద న‌టో అంద‌రికీ తెలిసిందే. ఆమె న‌ట‌న‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌కోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. రెండు ద‌శాబ్దాల హీరోల‌తో న‌టించిన ఘ‌న‌త శ్రీ‌దేవికే ద‌క్కింది. సాధార‌ణంగా హీరోలు అలా న‌టిస్తారు. కానీ హీరోయిన్ అలా న‌టించ‌డం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి. శ్రీ‌దేవి బోనీ క‌పూర్‌ను చేసుకున్నాక చాలా క‌ష్టాలు ప‌డ్డారు. బోనీక‌పూర్ త‌ల్లికి శ్రీ‌దేవి అంటే అస్స‌లు ఇష్టం ఉండేది కాదు. ప్ర‌తి రోజూ శ్రీ‌దేవిని తిడుతూనే ఉండేది. ఓ రోజు ఏకంగా ఆమెను కొట్టింది కూడా. అప్పుడు శ్రీ‌దేవి క‌డుపుతో ఉంది. కొన్నాళ్ళ‌కి త‌ట్టుకోలేక ఇంట్లోంచి బోనీని కూడా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి వేరే కాపురం పెట్టించింది శ్రీ‌దేవి.  శ్రీ‌దేవి ఎంత పెద్ద న‌టి అంటే... నాజానా క‌హేనా అనే సాంగ్ కోసం 103 డిగ్రీల ఫీవ‌ర్‌తో ఉన్నా కూడా శ్రీ‌దేవి నిర్మాత‌కు న‌ష్టం రాకూడ‌ద‌ని న‌టించింది శ్రీ‌దేవి. 

 

కొద్దిగా క్లోజ్‌గా గ‌మ‌నించిన‌ట్లైతే ఆ పాట‌లో శ్రీ‌దేవి మొహం కాస్త క‌ళ త‌ప్పిన‌ట్లుగా ఉంటుంది. కాని ఎంతో జాగ్ర‌త్త‌గా అబ్‌జ‌ర్బ్ చేస్తే త‌ప్పించి శ్రీ‌దేవి న‌ర్వ‌నెస్ తెలియ‌దు. షారూక్ ఖాన్ న‌టించిన బాజీగ‌ర్ సినిమా ఎంత పెద్ద సూప‌ర్ హిట్ అయిందో  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ సినిమాతో షారూక్‌, కాజ‌ల్‌, శిల్పాశెట్టి ఒక్క‌సారిగా సూప‌ర్‌స్టార్స్ అయిపోయారు. కాని మొద‌ట ఆ ఇద్ద‌రి హీరోయిన్ల‌కంటే ముందు శ్రీ‌దేవితో డ‌బుల్ రోల్స్ చేయించాల‌నుకున్నారు ద‌ర్శ‌కుడు. కాని డేట్స్ ప్రాబ్ల‌మ్‌తో కుద‌ర‌లేదు. శ్రీ‌దేవ‌ని జురాసిక్‌పార్క్ మూవీకి మెయిన్‌లీడ్‌గా తీసుకోవాల‌నుకున్నారు హాలీవుడ్ ద‌ర్శ‌కుడు స్పీల్‌బ‌ర్గ్‌. అందుకు ఆమెను కాంటాక్ట్ చేయ‌గా ఆమె నో చెప్పింది. 

 

ఎందుకంటే అప్ప‌టికే బాలీవుడ్‌లో నెం.1 స్ధానంలో ఉంది. దాదాపు ఏడాదికి డేట్స్ ఇవ్వాలంటే కుద‌ర‌ద‌ని. ఇప్ప‌టికే కొన్ని క‌మిట్మెంట్స్ అయ్యాయ‌ని చెప్ప‌డంతో హాలీవుడ్‌ని కూడా ఏలే ఛాన్స్‌ని పోగొట్టుకుంది శ్రీ‌దేవి. లేదంటే హాలీవుడ్‌లో శిఖ‌ర స్థాయిలో ఉండేది. నాలుగో ఏట నుంచే శ్రీ‌దేవి సినిమాల్లో న‌టించింది. ఆమెకు న‌టించ‌డం అంటే పిచ్చి అందుకే ఐదు భాష‌ల్లో దాదాపుగా 300కంటే ఎక్కువ సినిమాల్లో న‌టించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: