సహజనటి.. అందాల తార.. అతిలోక సుందరి.. ఇలా ఆమె గురించి చెప్పుకుంటూ వెళ్తే సమయం సరిపోదు.. అంతటి తారామణి దివికేగిరి సరిగ్గా ఈరోజుకు 2 సంవత్సరాలు అయ్యింది. ఆమె మరణం ఎందరో ప్రేక్షకులకు కన్నీళ్లు మిగిల్చింది. ఆమె ఆలా మరణిస్తారు అని ఎవరు ఉహించి ఉండరు.. అతి చిన్న వయసులోనే మరణించిన నటులలో శ్రీదేవి ఒకరు.. 

 

ఇకపోతే శ్రీదేవి మరణించాక.. శ్రీదేవి తొలి వర్థంతిని బోనీ కపూర్ ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. ఆమెకు సంబంధించిన ఒక చీరను వేలం వేశారు. శ్రీదేవికి ఎంతో ఇష్టమైన చీరను వారు వేలం వేసి ఆ వచ్చిన డబ్బును సేవా కార్యక్రమానికి ఉపయోగించారు. ఆమె మొదటి వర్ధంతి నాడు ఆమె పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. 

 

అలా నిర్వహించిన సేవ కార్యక్రమాలలోనే శ్రీదేవికి ఎంతో ఇష్టమైన చీరను వేలం వేసి వచ్చిన డబ్బును సేవా కార్యక్రమానికి ఉపయోగించారు. శ్రీదేవికి ఎంతో ఇష్టమైన 'కోటా' చీరను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టి అమ్మారు. 'పరిసెర' అనే లగ్జరీ ఆన్‌లైన్ షాప్‌లో ఈ చీరపై బిడ్‌లను ఆహ్వానిస్తున్నారు. ప్రారంభ బిడ్ ధరను రూ.40 వేలుగా నిర్ణయించారు.

 

ఆ చీరను వేలంలో పెట్టగ ఆ చీర దాదాపు లక్ష ముప్పై వేల రూపాయలకు అమ్మడు పోయింది. ఆ వచ్చిన డబ్బును 'కన్సెర్న్ ఇండియా ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందచేశారు. మహిళా సాధికారత కోసం ఈ స్వచ్చంద సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఈ సంస్దలో సుమారు లక్షా యాభై వేల మంది చిన్నపిల్లలు, మహిళలకు ఈ కార్యక్రమాలు చేరువయ్యాయి.

 

ఆమె ఉన్నంత కాలం ఆమెకు ఉన్న అభిమానులు తక్కువ కాదు.. ప్రపంచమంతా ఆమెకు అభిమానులు ఉన్నారు.. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా అన్ని భాషల్లో నటించిన ఆమె.. ఆమె నటనను చూసి హాలీవుడ్ సైతం వారి సినిమాల్లో నటించాలని ఆహ్వానించింది... కానీ శ్రీదేవి కొన్ని కారణాల వల్ల హాలీవుడ్ లో నటించలేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: