శ్రీ‌దేవి మొత్తం మీద దాదాపుగా మూడు వంద‌ల‌కు పైగా సినిమాల్లో న‌టించింది. ఇక బాలీవుడ్‌లో షారూక్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్ ఈ ముగ్గురిని క‌లిపినా కూడా ఆమె ద‌రిదాపుల్లోకి కూడా రాలేరు. శ్రీ‌దేవికి బాలీవుడ్‌లో కెరియ‌ర్‌ మొద‌ట్లో హిందీ స‌రిగా వ‌చ్చేది కాదు. ఆమెకు నాస్ డ‌బ్బింగ్ చెప్పేది. త‌ర్వాత కొన్ని చిత్రాల్లో రేఖా కూడా ఆమెకు డ‌బ్బింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఇక ఆ త‌ర్వాత చాందిని చిత్రంతో మొద‌టిసారి త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది శ్రీ‌దేవి. ఇక సూప‌ర్ హిట్ మూవీ బేటాలో మొద‌ట శ్రీ‌దేవిని హీరోయిన్‌గా చేయ‌మ‌ని అడిగారు. కానీ అప్ప‌టికే అనిల్ క‌పూర్‌తో చాలా సినిమాలు చేశాను. ఇక చేయ‌ను అని చెప్ప‌డంతోనే ఆ చిత్రంలో మాధురి దీక్షిత్‌కి ఛాన్స్ వ‌చ్చింది. అలాగే డ‌ర్ సినిమాలో ఛాన్స్ శ్రీ‌దేవి ఛాన్స్ వ‌దులుకోవ‌డం కార‌ణంగానే జూహీచావ్లాకి ఛాన్స్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆమె పెద్ద హీరోయిన్‌గా మారింది. ఇలా ఆమె వ‌దిలేసిన ఎన్నో సినిమాల ద్వారా కొత్త హీరోయిన్స్ స్టార్లుగా మారారు.

 

ఇక అలాగే లాడ్‌లా సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన స‌మ‌యంలో దివ్య‌భార‌తి చ‌నిపోయింది. దీంతో అనిల్‌క‌పూర్ స‌ర‌స‌న మ‌ళ్ళీ శ్రీ‌దేవిని పెట్టి రెండోసారి షూట్ చేశారు. ఇక శ్రీ‌దేవికి సినిమా పాత్ర‌లంటే ఎంత ఇష్ట‌మో వేరే చెప్ప‌క్క‌ర్లేదు. త‌న కూతుర్లిద్ద‌రికీ కూడా బోనీక‌పూర్ తీసిన జుడాయి, దిల్ ఆప్‌కే పాస్ హై సినిమాలోని హీరోయిన్ల పేర్లే జాన్వి, ఖుషీల‌కు పెట్టింది.  అయితే శ్రీ‌దేవి కొన్ని సినిమాల్లో పాట‌లు కూడా పాడింది. కాక‌పోతే చిన్న చిన్న బీట్స్‌గా గాత్ర‌దానం చేసింది. స‌ల్మా, చాందిన‌, క్ష‌ణ‌,క్ష‌ణంలో త‌న వాయిస్‌ని టెస్ట్ చేసుకుంది శ్రీ‌దేవి. 

 

శ్రీ‌దేవికి పెయింటింగ్స్ వేయ‌డ‌మంటే చాలా ఇష్టం. ఆమె పెయింటింగ్స్‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యూజియ‌మ్‌లో కూడా పెట్టారు. షారూక్‌తో సినిమా చేయ‌డానికి తానే ప్రొడ్యూస‌ర్‌గా మారి సినిమాని రూపొందించింది. అయితే అందులో ఆమె హీరోయిన్‌గా చేయాల్సి ఉన్నా. ఆమె ఆ స‌మ‌యంలో ప్రెగ్నెంట్ కావ‌డంతో ఆ సినిమా నుంచి త‌ప్పుకుంది. బాహుబ‌లిలో శివ‌గామి క్యారెక్ట‌ర్ కోసం శ్రీ‌దేవిని తీసుకుందాం అనుకున్నారు. కానీ కొన్ని డిమాండ్స్ వ‌ల్ల అది స‌ఫ‌లీకృత‌మ‌వ్వ‌లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: