వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న శర్వానంద్ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. లేటెస్ట్ మూవీ ‘జాను’ ఫ్లాప్ కావడంతో శర్వానంద్ మార్కెట్ విపరీతంగా పడిపోవడమే కాకుండా అతడి పారితోషికాన్ని తగ్గించుకోమని నిర్మాతలు శర్వా పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీనికితోడు శర్వానంద్ మూవీలకు క్రేజ్ తగ్గిపోవడంతో అతడి సినిమాలు కొనుక్కోవడానికి బయ్యర్లతో పాటు ఛానల్స్ కూడ పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. 


ఇప్పుడు ఈ పరిస్థితులు అన్నీ శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’ మూవీకి శాపంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. నూతన దర్శకుడు కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వ్యవసాయం నేపథ్యంలో తీస్తున్నారు. ఈ మూవీలో కూడ ఆర్గానిక్ ఫార్మింగ్ టాపిక్ ఉంటుందని టాక్. ఇప్పటికే ఇదే పాయింట్ తో నితిన్ ‘భీష్మ’ లేటెస్ట్ విడుదలై హిట్ కొట్టింది. 


దీనితో మళ్ళీ అదే పాయింట్ తో మరొక సినిమా వస్తే ప్రేక్షకులు అంగీకరించరు. ఈ సంవత్సరం సమ్మర్ రేస్ కు ఏప్రిల్ లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఆశించిన విధంగా రావడంలేదని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ రైట్స్ ను చాల తక్కువ రేట్లకు అడుగుతున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీని తక్కువ రేట్లకు అమ్మలేక ధైర్యం చేసి ఈ సినిమా రైట్స్ తమ వద్ద ఉంచుకోలేక ఈ మూవీ నిర్మాతలు 14 రీల్స్ సంస్థ ఎటూ తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉన్నట్లు టాక్. 


దీనితో ఈ మూవీ నిర్మాతలు శర్వానంద్ ను కలిసి తాము మొదట ఒప్పుకున్నా పారితోషికం పూర్తిగా ఇవ్వలేమని సహకరించమని కోరుతునట్లు టాక్. అయితే ఒక సినిమాకు పెద్ద మనసుతో తన పారితోషికాన్ని తగ్గించుకుంటే ఇదే పరిస్థితి తనకు శాస్వితంగా కొనసాగే ఆస్కారం ఉందని శర్వానంద్ భావిస్తూ ఈ కష్టాల నుండి గట్టెక్కే సినిమాకోసం ఎదురు చూస్తున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: