తెలుగు సినిమాల లో శ్రీదేవి చక్కటి నటన తో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది. కేవలం తమిళ్, తెలుగు సినిమాలనే కాక నటి శ్రీదేవి కన్నడ, మళయాల సినిమాల లో కూడా శ్రీదేవి మంచి స్థానాన్ని పొందింది. అయితే ఆమె పాత్రలు నిజం గా చెప్పుకో బడినవి. మా నాన్న నిర్దోషి, అగ్ని పరీక్ష, నెనో మనిషినే, నా తమ్ముడు ఇలా ఎన్నో సినిమాల లో నటించింది నటి శ్రీదేవి.
 
 
 
Image result for sridevi
 
ఈమె పద్మశ్రీ ని కూడా అందుకున్న లెజండరీ నటి. ఎస్. పి. పరశురాం, గోవిందా గోవిందా, క్షణ క్షణం వంటి సినిమాల లో శ్రీదేవి గారి పాత్రలు అద్భుతం. క్షణ క్షణం సినిమాకి ఉత్తమ నటి గా ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. అలానే ఆ సినిమా కి నంది అవార్డు కూడా లభించింది శ్రీదేవి కి. జగదేక వీరుడు అంటూ సినిమా లో మంచి స్థానాన్ని దక్కించుకుంది ఈ అతి లోక సుందరి.
 
 
మంచి పాటల తో చక్కటి ఎక్స్ప్రెషన్స్ తో శ్రీదేవి ఇట్టే ఆకట్టుకుంటుంది. బంగారక్క సినిమా తో తెలుగు వారికి పరిచయం అయ్యింది. ఈ చిత్రం 1977 లో రిలీజ్ అయ్యింది. అప్పుడే తెలుగు లో తొలి పరిచయం. ఆ తరువాత 1978 లో పదహారేళ్ళ వయస్సు, ఎర్ర గులాబీలు, బుర్రిపాలెం బుల్లోడు, కార్తీక దీపం ఇలా ఎన్నో సినిమాల తో తెలుగు నటి అయ్యింది శ్రీదేవి.
 
 
Image result for sridevi
 
 
తెలుగు లో అనేక సినిమాల లో నటించింది. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, కృష్ణ ఇలా స్టార్ హీరోస్ తో శ్రీదేవి గారు చేసిన సినిమాల లో ఆ పాత్రలు చెప్పుకో దగినవి. అలానే చిరంజీవి, వెంకటేష్ వంటి వాళ్ళతో సైతం నటించింది. ప్రేమాభిషేకం 500 రోజులు ఆడింది హైదరాబాద్ లో. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: