యంగ్ హీరో నితిన్ ఎట్టకేలకు సాలిడ్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ  భీష్మ గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అదిరిపోయే ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. మొదటి, రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 10కోట్లకు పైగా షేర్ ను రాబట్టిన ఈ చిత్రం మూడో రోజు కూడా అదే జోరు కొనసాగించడం తో 4.37కోట్ల వసూళ్లును రాబట్టి మూడు రోజుల్లో 14.71 కోట్ల షేర్ తో అదుర్స్ అనిపించింది. ఇక ఈ చిత్రం అటు ఓవర్సీస్ లో కూడా అదరగొడుతుంది. నిన్నటివరకు అక్కడ 600k డాలర్ల వసూళ్లను రాబట్టి  బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది. 
 
ఇక  మొత్తం మూడు రోజుల్లో భీష్మ ప్రపంచ వ్యాప్తంగా 18కోట్ల షేర్ ను రాబట్టి  ప్రీ రిలీజ్ బిజినెస్ లో 80 శాతం రికవరీ చేసింది. ఈవారంలో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుండడం తో ఫుల్ రన్ లో 30కోట్ల షేర్ ను టచ్ చేసేలానే కనిపిస్తుంది. 
 
భీష్మ మూడు రోజుల వసూళ్ల వివరాలు : 
 
నైజాం - 5.95 కోట్లు 
సీడెడ్ - 2.1 కోట్లు 
ఉత్తరాంద్ర - 1.78 కోట్లు 
గుంటూరు - 1.34 కోట్లు 
తూర్పు గోదావరి - 1.21 కోట్లు 
పశ్చిమ గోదావరి - 0.88 కోట్లు '
కృష్ణా - 0.97 కోట్లు 
నెల్లూరు - 0.48 కోట్లు 
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మూడు రోజుల షేర్ = 14.71 కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: