కాదేదీ కాపీకి అనర్హం అన్నట్లు.. ఈ మద్య కొంతమంది కాపీ రాయుళ్లు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.  అతి సినిమా, వ్యాపార ఇతర రంగాల్లో దేనిలో అయినా సరే కాపీ మార్క్ చాలా వరకు ఉంటుంది.  తాజాగా క్రియేటివిలో కూడా ఈ మద్య కాపీ మార్క్ పడుతుందని పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మద్య కాలంలో ఓ చిత్రం రిలీజ్ అవుతుందంటే అది థియేటర్లో కి వచ్చే వరకు టెన్షన్.. ఎందుకంటే ఆ మూవీలో సాంగ్ నా ట్యూన్ కాపీ చేశారని ఒకరు.. లేదు స్టోరీ లైన్ నాదే అని ఒకరు.. అసలు సినిమా టైటిల్ నాదే అని మరొకరు.. ఇలా కాపీ చేశారని ఎంతోమంది అభ్యంతరాలు పెడుతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.  తాజాగా ఇదే వివాదం ఓ అందాల బొమ్మ ఫోటోపై వచ్చింది.  కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటించిన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షులకు పరిచయమైనా భామ కియార అద్వానీ, ఈ సినిమాతరువాత  రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించింది.

 

రామ్ చరణ్ తో ఎన్నో ఆశలు పెట్టుకొని నటించినప్పటికీ.. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.   తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ షూట్ లో రత్తాన్ని తన క్రియేటివిటీని మొత్తం ఉపయోగించి కియారను ఫోటోలు తీసాడు. కేవలం పచ్చని ఆకును అడ్డుగా పెట్టుకొని కియారా తన నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఫోటోని తీశారు. ఈ ఫోటో కాస్తా వైరల్ అయ్యింది.  దీనిపై సోషల్ మీడియాలో రక రకాల కామెంట్స్ వచ్చాయి.. ఈ ఫోటోని రక రకాలుగా మార్ఫింగ్ కూడా చేశారు. మంచి ఫామ్ లో ఉన్న నటి ఇలా నగ్నచిత్రాలు ఏంటీ అంటూ కొంత మంది నెటిజన్లు ఫైర్ కూడా అయ్యారు.  అంతే కాదు ఇప్పుడు మరో వివాదంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 

ఈ ఫోటోషూట్ కాపీ చేసారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంట్రనేష్నల్ ఫోటోగ్రాఫర్ మేరీ బార్ష్ ఫోటో షూట్ తో దీనికి పోలికలు ఉన్నాయి. ఈ ఫోటో షూట్ లో కూడా ఇలానే ఒక మోడల్ ఆకును అడ్డుగా పెట్టుకొని ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. దాంతో డబూ రత్నానీ సోషల్ మీడియాలో రక రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఛీ.. ఇప్పుడు క్రియేటివిటీ ని కూడా కాపీ కొడుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: