విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేసి ఫ్లాప్ అందుకున్నాడు. ఈ ఫ్లాప్ తో విజయ్ దేవరకొండకు వచ్చిన నష్టం కంటే దర్శక, నిర్మాతలకు జరిగిన నష్టమే ఎక్కువ. వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఏమాత్రం ప్రభావం పడకపోవడమే ఇందుకు నిదర్శనం. ఆర్ధిక ఇబ్బందుల్లో నిర్మాత, కెరీర్ ఇబ్బందుల్లో పడి దర్శకుడు నష్టపోయారు. ఇందుకు కారణం స్క్రిప్ట్ విషయంలో విజయ్ దేవరకొండ వేలు పెట్టడమే అని అంటున్నారు. టాలీవుడ్ తోపాటు మొత్తం సౌత్, బాలీవుడ్ లో కూడా విజయ్ సినిమాలపై క్యూరియాసిటీ ఉంది.

 

 

ప్రస్తుతం విజయ్ తన నెక్స్ట్ సినిమాను పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియన్ సబ్జెక్టుగా తెరకెక్కిస్తున్నాడు పూరి. వీరికి బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ జత కలిశాడు. ప్రస్తుతం విజయ్ తన పూర్తి ఫోకస్ ని ఈ సినిమాపై పెట్టాడు. ఫైటర్ అనే టినెటివ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను తన ప్రొడక్షన్ హౌస్ నుంచి హిందీలో విడుదల చేయనున్నాడు కరణ్ జోహార్. తన తర్వాత ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇందుకు తాను సహకరిస్తానని అంటున్నాడట కరణ్. బాలీవుడ్ లో కరణ్ జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుందనే టాక్ ఉంది.

 

 

కరణ్ జోహర్ కు విజయ్ అంటే గురి కుదిరినట్టుంది. నిజానికి డియర్ కామ్రేడ్ సినిమా విడుదల కాకుండానే హిందీ రీమేక్ రైట్స్ కొన్నాడు. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టు పక్కనైతే పెట్టాడు కానీ విజయ్ తో సినిమా తీయడం మాత్రం ఆపలేదు. కరణ్ సలహాలు పాటిస్తే అయినా అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నుంచి బయటపడతామో అని కూడా అంటున్నారు. పూరితో సినిమా హిట్ అయితే విజయ్ కు ఆలిండియాలో క్రేజ్ మరింత పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: