అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో చెప్పలేం. కలిసొచ్చిన సమయాన జరిగే అద్భుతాలు మరింత మధురంగా ఉంటాయి. ప్రస్తుతం హీరో నితిన్ పరిస్థితి అలానే ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన 18ఏళ్లలో హిట్లు చూశాడు.. వరుసగా దాదాపు పది ఫ్లాపులు చూశాడు. కానీ ప్రయత్నాలు ఆపలేదు. ఇష్క్ తో మళ్లీ హిట్ బాట పట్టి దాదాపు అదే రేంజ్ లో వెళ్తున్న నితిన్ కు ప్రస్తుతం భీష్మతో భారీ బ్లాక్ బస్టర్ దక్కింది.

 

 

 

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా ఉన్న నితిన్ కు తన గర్ల్ ఫ్రెండ్ షాలినితో పెళ్లి కుదిరింది. ఇందుకు సంబంధించి ఇటివలే ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. అంటే.. సగం పెళ్లి అయిపోయినట్టే అంటారు. మరి ఆమె అడుగుపెట్టిన వేళా విశేషమేమో నితిన్ కు భీష్మ రూపంలో కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ కు చెందిన షాలినితో 8ఏళ్ల పరిచయం.. 5ఏళ్ల ప్రేమ ప్రస్తుతం వీరిద్దరూ ఒకటి కావడానికి దోహదపడింది. ఇలా వీరి పెళ్లి పనులు మొదలయ్యాయో లేదో ఇలా నితిన్ సినిమా విడుదలై ఓపెనింగ్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల, యూఎస్ లో బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చేసిందంటున్నాయి ట్రేడ్ రిపోర్ట్స్.

 

 

 

ఇప్పట్లో మరో పెద్ద సినిమా వచ్చే అవకాశం లేదు కాబట్టి లాంగ్ రన్ లో భీష్మ మరింత మంచి వసూళ్లు సాధిస్తందని అంటున్నారు. నితిన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిపోనుంది భీష్మ. ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ లో షాలినీని తన ఆరోప్రాణంగా చెప్పుకున్న నితిన్ కు ఆ ఆరోప్రాణమే సెంటిమెంట్ గా మంచి బహుమతి ఇచ్చిందని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: