ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి సినిమాల‌కు ఎలాంటి హైప్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రాజ‌మౌళి సినిమా వ‌స్తుందంటేనే ఆ హైప్ రేంజ్ వేరే లెవ‌ల్లో ఉంటుంది. బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి రేంజ్ ఇప్పుడు టాలీవుడ్ కాదు క‌దా.. బాలీవుడ్‌ను దాటేసి హాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ఇప్పుడు రాజ‌మౌళి సినిమా వ‌స్తుందంటేనే ఇండియ‌న్ సినిమా అభిమానులే కాదు యావ‌త్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్న సినీ అభిమానులు సైతం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. 

 

ఇక ఇప్పుడు రాజ‌మౌళి టాలీవుడ్ క్రేజీ యంగ్ స్ట‌ర్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌న్ కాంబినేష‌న్లో ఆర్.ఆర్.ఆర్ సినిమా తెర‌కెక్కిస్తుండ‌డంతో ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉండాలి.. ఈ అంచ‌నాలు ఊహ‌ల‌కే అంద‌డం లేదు. ఆర్.ఆర్.ఆర్ నాలుగైదు భాషల్లో కాదు ఏకంగా 10 భాషల్లో విడుదలవుతున్న సినిమా. సినిమా ఎప్పుడు వ‌స్తుంది ?  బాహుబలి లా ఉంటుందా ? అంత‌కు మించి ఉంటుందా ? అని ప్ర‌తి ఒక్కరు ఎన్నో అంచ‌నాల‌తో ఉన్నారు.

 

ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతున్న స్థాయికి మాములు హిట్ అయితే సరిపోదు. బాహుబలి కలెక్షన్స్ ను దాటి మరో స్థాయిలో హిట్ అవ్వాల‌ని కొంద‌రు అంటున్నారు. అయితే ఈ పుకార్ల‌కు ఓ టాప్ స్టోరీ రైట‌ర్ చెక్ పెట్టేశాడు. అత‌డే బాహుబలి రైటర్ మదన్ కార్కీ. తమిళ వెర్షన్ కు మాటలు రాసాడు ఈ రచయిత. అంతే కాకుండా బాహుబ‌లి సినిమాలో ఉన్న కిల్కీ భాష‌ను కూడా క‌నిపెట్టాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమా అదిరిపోతుంద‌ని.. బాహుబ‌లిని మించిన బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని చెప్పాడు.

 

అలాగే సినిమాలో చరణ్, ఎన్టీఆర్ పాత్రలు అద్భుతంగా వస్తున్నాయని, ఒక పాత్రను మించి మరో పాత్ర ఉంటుందని తెలిపాడు. మదన్ కార్కీ చెప్పిన మాట‌ల‌తో ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ అభిమానుల ఆనందానికి అవ‌ధులే లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: