నాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అ! తో మొదలైన నాని ప్రయత్నం ఇప్పుడు హిట్ తో ముందుకు వస్తుంది. నాని  నిర్మించిన హిట్ మూవీని శైలేష్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విశ్వక్  సేన్, రుహాని శర్మ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డైరెక్టర్ రాజమౌళి, రాఘవేంద్ర రావు, నందిని రెడ్డి అటెండ్ అయ్యారు. వీళ్ళే కాకుండా యువ హీరోలు చాలామంది అటెండ్ అయ్యారు. 

 

నాని ప్రొడక్షన్ లో రెండో సినిమా అంటే మొదటి సినిమా సక్సెస్ అవడం వల్లే రెండో సినిమా చేయగలుగుతున్నాడు. తన నిర్మాణంలో మొదటి సినిమా చేసిన ప్రశాంత్ వర్మ హిట్ ఈవెంట్ లో కనబడలేదు. నాని పిలిచినా అతను రాలేదో లేక నాని కావాలని అతన్ని పిలవలేదో కాని నాని హిట్ ఈవెంట్ లో ప్రశాంత్ కనిపించకపోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తనకు ఛాన్స్ ఇస్తే మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా కథ రాస్తా అని చెప్పిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళాడు. 

 

అ! తర్వాత రాజశేఖర్ తో కల్కి సినిమా చేశాడు ప్రశాంత్ వర్మ. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. కల్కి హిట్ అయితే పరిస్థితులు ఎలా ఉండేవో కాని ప్రస్తుతం ప్రశాంత్ కు సినిమా ఛాన్సులు లేవని టాక్. నాని హిట్ ఈవెంట్ లో కనిపిస్తే నిర్మాతలు తనని గుర్తుపట్టే ఛాన్స్ ఉన్నా అది కూడా మిస్ చేసుకున్నాడు. మరి నాని డైరెక్టర్ ప్రశాంత్ ల మధ్య ఏదైనా జరిగిందా లేక నాని పిలిచినా అతను రాలేదా అన్నది తెలియాల్సి ఉంది. నాని ఓ పక్క నిర్మాతగా చేస్తూ తన సినిమాలను స్పీడ్అప్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: