నటిగా దశాబ్దాల అనుభవం, అనేక సంవత్సరాల పాటు, వివిధ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన చరిత్ర కలిగిన హీరోయిన్ శ్రీదేవి గురించి ప‌రిచ‌డం అక్క‌ర్లేదు. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డం … ప‌రిశ్ర‌మ ఏదైనా శ్రీ‌దేవికి ఉన్న గుర్తింపు అసాధార‌ణం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిగా వీరాభిమానులున్నారు. ఐదు ద‌శాబ్ధాల కెరీర్‌లో వంద‌లాది సినిమాల్లో న‌టించి మెప్పించారు. తన హొయలుతో ఆకట్టుకున్న శ్రీదేవి స్టయిల్ ను ప్రశంసించని వారు ఉండరు. చివ‌రిగా బాలీవుడ్ నాయిక‌గా సెటిలై, అక్క‌డే బోనీ క‌పూర్‌ని పెళ్లాడి లైఫ్‌లో సెటిల‌య్యారు. 

 

అయితే బోనికపూర్‌ సోదరి రీనా కుమారుడు మోహిత్‌ మార్వా పెళ్ళికని దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24,2018న బాత్‌ టబ్‌లో మునిగి కన్ను మూసింది. ఆమె హఠాత్తుగా మృతి చెందడాన్ని సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు, సామాన్యులు జీర్ణించుకోలేకపోయారు. శ్రీదేవి బాత్‌రూంలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో అమె అక్కడే కుప్పకూలిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి తరలించే లోపు ఆమె మృతి చెందారు. ఇక ఈ అతిలోకసుందరి అనంతలోకాల్లో కలిసిపోయి నేటికి రెండేళ్లు అవుతోంది.

 

ఈరోజు శ్రీదేవి వర్థంతి సందర్భంగా అభిమానులు శ్రీదేవిని తలుచుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. వాస్త‌వానికి  శ్రీ‌దేవి న‌ట‌జీవితంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు.. అనుభ‌వాలు .. అనుభూతులు ఉన్నాయి. అయితే నాగిన అనే బాలీవుడ్ సినిమాలో శ్రీ‌దేవి ముఖ్య పాత్ర‌లో న‌టిచింది. ఈ సినిమా చిత్రీకరణ స‌మ‌యంలో శ్రీదేవి కంటిచూపు మందగించింది అయినా శ్రీదేవి మాత్రం వెన‌క్క‌త‌గ్గ‌లేదు. ఇక ఈ సినిమా లో శ్రీదేవి కనబరచిన ప్రతిభ అనిర్వచనీయం. ఆమె ప్రతిభ ప్రేక్షకుల హృదయాలలో చిరకాలం నిలిచిపోతుంది. 80స్ కి సంబంధించిన రాయల్ అవుట్ ఫిట్స్ లో ఆమె అందంగా ఇమిడిపోయింది. ఈ మూవీ సీక్వెల్ లో వివిధ రకాల స్టైల్ బుక్స్ ని కనబరిచింది. ఈ మూవీలో ట్రెడిషనల్ అట్టైర్స్ తో మరింత ఆకట్టుకుంది శ్రీదేవి.  

 
  

 
  

 

మరింత సమాచారం తెలుసుకోండి: