సిని పరిశ్రమలో నిలబడాలి అంటే హిట్స్ చాలా అవసరం. ఒక సినిమా కాకపోతే ఒక సినిమా అయినా సరే హిట్ అవ్వాలి. వరుస ఫ్లాపులు వస్తే ఆ హీరో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. సినిమా విజయం సాధిస్తేనే దర్శకులు అయినా నిర్మాతలు అయినా సరే పెట్టుబడి పెట్టడానికి ముందుకి వస్తారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే ఈ మధ్య కథల విషయంలో హీరోలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించడం లేదనే చెప్పాలి. గతంలో చాలా మంది హీరోలు సినిమాలు ఫ్లాప్ అయి వెళ్ళిపోయారు కూడా.

 

ఇప్పుడు ఆ డేంజర్ జోన్ లో ఉన్నాడు శర్వానంద్. ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. పడిపడి లేచే మనసు, రణరంగం, తాజాగా జానూ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ మూడు కూడా మంచి అంచనాలతో వచ్చిన సినిమాలే అయినా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దీనితో ఇప్పుడు శర్వా కనుమరుగు అవుతాడా అనే ఆందోళన మొదలయింది అతని అభిమానుల్లో. గతంలో మంచి సినిమాలు చేసిన శర్వానంద్, భిన్నమైన కథల కోసం ప్రయత్నాలు చేసే క్రమంలో కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నాడు. 

 

ఇప్పుడు అదే అతనికి పెద్ద దెబ్బగా మారింది అంటున్నారు. సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో శర్వా ఇప్పుడు ఆందోళనలో ఉన్నాడు. ఆయన ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నాడు. ఆయ‌న తాజా చిత్రం `శ్రీకారం` బిజినెస్‌కు పెద్ద‌గా ఆద‌ర‌ణ దొర‌క‌డం లేదు. శాటిలైట్‌, డిజిటల్ రైట్స్‌ను త‌క్కువ ధ‌ర‌కు అడుగుతున్నారు. 14 రీల్స్ ప్ల‌స్‌ బ్యాన‌ర్‌పై కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో వ్య‌వ‌సాయం ప్రధానంగా ఈ సినిమా వస్తుంది. వరుస ఫ్లాపులు ఉండటంతో సినిమాను కొనడానికి ముందుకు రావడం లేదు. మంచి ఇమేజ్ ఉన్నా సరే చరిత్ర చూస్తున్న కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: