విలక్షణ నటుడు వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ పాత్రలో ఒదిగిపోయి నటించే గొప్ప నటుడు కమలహాసన్. అయితే దేశ వ్యాప్తంగా కమల్ హాసన్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి జీవించి నటించగల సత్తా కమలహాసన్ సొంతం. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగల నటుడు హీరో కమల్ హాసన్. ఇక సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సాహసమైన చేయడానికి ముందుంటారు. 65 ప్లేస్లో ను ఇంకా కమల్ యాక్షన్  లోనే కాదు రొమాన్స్ లోనూ బాగా స్పీడ్ చూపిస్తున్నారు అనే చెప్పాలి. అయితే కమల్ హాసన్ సినిమాల్లో నటన తో పాటు... పలు వివాదాలతో కూడా.. ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంటారు. 

 

 

 అయితే కమల్ హాసన్ లో రొమాంటిక్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే ఇప్పుడు రొమాంటిక్ యాంగిల్  ఆయన వివాదాల్లోకి నెడుతున్నట్లు  తెలుస్తోంది. బాలచందర్ ప్రియ శిష్యుడిగా కోలీవుడ్లోకి అడుగుపెట్టారు కమలహాసన్. ఇక బాలచందర్ దర్శకత్వంలోని ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. ఈ క్రమంలోనే కమల్ రేఖ జంటగా పున్నగి మన్నన్  అనే సినిమాలో  నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో కమల్ రేఖకు మధ్య ఓ లిప్లాక్ సీన్ ఉంటుంది. అయితే ఈ సీన్ గురించి రేఖకు  తెలియకుండానే హీరో  డైరెక్టర్ మాత్రమే చర్చించుకునీ పెట్టారట. అయితే చిత్రీకరణలో లిప్ లాక్ సీన్ చేయడంతో రేఖ కూడా అప్పట్లో ఏమనలేక పోయారట. సినిమాల్లో  ఇలాంటివి కామన్  అంటూ సైలెంట్ గానే ఉండిపోయారట.

 

 అయితే తాజాగా ఆ సినిమా లో జరిగిన ముద్దు సన్నివేశాన్ని ఇప్పుడు రేఖ వివాదాస్పదంగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో కమల్ చేసిన లిప్ లాకు ఒక లైంగిక వేధింపు లాంటిది అంటూ కామెంట్ చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ముందుగానే తనకు లిప్ లాక్ సీన్ గురించి చెప్పి చిత్రీకరించి ఉంటే బాగుండేదని కానీ అనుమతి తీసుకోకుండా... దర్శకుడు హీరో రహస్యంగా ప్లాన్ చేసి ఇలా  లిప్ లాక్ కిస్ ను ఆడ్ చేయడం తనకు ఎంతగానో అసంతృప్తిని ఆవేదనను మిగిల్చింది అంటూ రేఖ వ్యాఖ్యానించారు. అయితే ఎన్ని రోజుల వరకు సైలెంట్ గానే ఉన్న రేఖ ఇప్పుడు ఆ లిప్ లాక్ సీన్ ని తెరమీదికి తెచ్చి వివాదంగా మార్చడంతో  ఒక్కసారిగా కాలీవుడ్ లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: