ఏదో అనుకుంటే ఇంక ఏదో అయ్యిందట. పవన్ కళ్యాణ్ దగ్గర కి వెళ్ళి సినిమా కోసం మాట్లాడదాం అనుకున్నాడు ఎస్. ఎస్. తమన్. కానీ సీన్ అంతా రివర్స్ అయ్యిపోయింది. వెళ్ళి సినిమా కోసం మాట్లాడదాం అనుకుంటే ఎంతో ఎమొషనల్ అయ్యి పోయాడు ఈ మ్యూజిక్ డైరక్టర్.
 
 
IHG
 
 
అయితే పాటల కోసం వాటిని వినిపించడం కోసం వెళ్ళాడు తమన్. కానీ పవన్ ఇంటికి వెళ్ళాక తమన్ కి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి అని చెప్పాడు. పైగా నోట మాట కూడా రాలేదట అతనికి. మంచి మ్యూజిక్ ని ఎన్నో సినిమాల కి ఇచ్చాడు. అలానే టాప్ హీరోల తో కూడా పని చేసాడు. అంతే కాకుండా వివిధ సెట్స్ లో పాల్గొంటాడు తమన్. కానీ ఎందుకు ఇక్కడ మాట రాలేదో నిజం గా ఓ ఆశ్చర్యమే. ఎప్పటి నుండో అనుకుంటున్నాడట పవన్ కళ్యాణ్ సినిమా కి సంగీతం ఇద్దాం అని. అయితే హఠాత్తుగా అవకాశం వచ్చే సరికి ఎంతో భయ పడ్డాడని తాజాగా తమన్ చెప్పాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజగా పింకీ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అయితే పింకీ చిత్రానికి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్న వార్త కూడా తెలిసినదే.  
 
IHG
 
 
అయితే కంపోజ్ చేసిన పాటలని వినిపించాను కానీ ఎంతో కంగారు వచ్చేసి చెమటలు పట్టేసాయి అని తమన్ చెప్పాడు. ఎందుకు అంటే భయం వల్ల కాదు ఆయన పై గౌరవం, ఒత్తిడి వల్ల మాత్రమే అని స్పష్టం కూడా చేసాడు. త్వరలో ఫస్ట్ సాంగ్ తో వస్తాను లవ్ యూ సార్ అని అన్నాడు. కానీ ఇదంతా ఒక కలలా అనిపించింది అని తమన్ స్వయంగా చెప్పాడు సోషల్ మీడియాలో.

మరింత సమాచారం తెలుసుకోండి: