నేచురల్ స్టార్ నాని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ కు ఇచ్చాడు. అందులో భాగంగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో నాని తన 27వ చిత్రంలో నటించనున్నాడు. ఈరోజు నాని పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ మరియు విడుదల తేదిని ప్రకటించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి 'శ్యామ్ సింగ రాయ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. జులై నుండి సెట్స్ మీదకు వెళ్లనుండగా డిసెంబర్ 25న విడుదలకానుంది.  ఈ చిత్రం లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందని టాక్ అయితే హీరోయిన్ మరియు సంగీత దర్శకుడు పేర్లను మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.
 
ఇక నాని ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీష్ లో నటిస్తున్నాడు. ఈచిత్రంలో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్  కథానాయికలుగా నటిస్తుండగా థమన్  సంగీతం అందిస్తున్నాడు షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జులై లో విడుదలకానుంది. కాగా నాని -శివ నిర్వాణ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబో లో వచ్చిన నిన్ను కోరి సూపర్ హిట్ అయ్యింది. దాంతో టక్ జగదీష్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. 
 
ఇదిలా ఉంటే  నాని మరో నెల రోజుల్లో వి తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మల్టీ స్టారర్ గా  రానున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ గా నాని విలన్ గా కనిపించనున్నారు. మార్చి  25న ఈ చిత్రం విడుదలకానుంది. నానికి ఇది 25వ సినిమా కావడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: