ఎలాంటి సిని నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన వారిలో నాని ఒకరు. అష్టా చమ్మ సినిమా నుండి ఈమధ్య గ్యాంగ్ లీడర్ వరకు నాని ప్రతి సినిమాలో తన నాచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. నాచురల్ స్టార్ గా తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు నాని. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ ఆల్రెడీ సెట్స్ మీద ఉంది.   

 

వి సినిమా మార్చి 27 ఉగాది కానుకగా రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక టక్ జగదీష్ రిలీజ్ ఎప్పుడో తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే ఈరోజు నాని బర్త్ డే సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఓ సినిమా ఎనౌన్స్ చేశారు. టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో నాని హీరోగా చేస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమా టైటిల్ ఆ పోస్టర్ చూస్తే నాని మరో కొత్త కథతో వస్తున్నాడని అనిపిస్తుంది. ఇక నాచురల్ స్టార్ ఇమేజ్ ఉన్నా సరే మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న నాని నెక్స్ట్ లెవల్ కు వెళ్లాలని బాగా కసిగా ఉన్నాడని తెలుస్తుంది.    

 

ఓ పక్క తన మార్క్ ఎంటర్టైన్ మూవీస్ చేస్తూనే మరో పక్క ఎక్స్ పెరిమెంట్స్ చేస్తే బెటర్ అని నాని ఆలోచన. అందుకే నాని తన పంథా మార్చుకుని ప్రయత్నిస్తున్నాడు. శ్యామ్ సింగ రాయ్ నాని మాస్ ఇమేజ్ కోరిక తీర్చే సినిమా అవుతుందని అంటున్నారు. సితార ప్రొడక్షన్ లో జెర్సీతో హిట్ అందుకున్న నాని ఈసారి ఎలాంటి సూపర్ హిట్ కొడతాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: