పెద్ద సినిమా చేస్తున్నాం.. అనే సంతోషం రెట్టింపు అవ్వాలంటే ఆ తర్వాతి ప్రాజెక్ట్ ని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. భారీ సినిమా తెచ్చిన అంచనాలను మ్యాచ్ చేయాలి. అప్పుడే గ్రాఫ్ కరెక్ట్ గా ఉంటుంది. అందుకే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎలాంటి కథలు ఎంచుకోవాలని తర్జనభర్జనలు పడుతున్నారు హీరోలు.

 

రాజమౌళి దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ డ్రామా ట్రిపుల్ ఆర్. మన్యం వీరులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిసి ఉద్యమాన్ని నిర్మిస్తే.. ఆ పోరాటం ఏ స్థాయిలో ఉంటుదనే కథాంశంతో తెరకెక్కుతోంది సినిమా. ఈ మూవీలో తారక్.. కొమురం భీమ్ పాత్ర పోషిస్తుంటే.. చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నాడు.

 

నందమూరి, కొణిదెల హీరోలు ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తోన్న సినిమా ట్రిపుల్ ఆర్. పైగా బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న మూవీ. దీంతో సౌత్ తో పాటు, బాలీవుడ్ కూడా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 400కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో.. ఎంత కలెక్ట్ చేస్తుందో అని ట్రేడ్ వర్గాల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. 

 

ట్రిపుల్ ఆర్ లాంటి భారీ సినిమాలో నటించిన హీరోల తర్వాత ప్రాజెక్ట్స్ పైనా భారీ అంచనాలుంటాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహోపై ఎంత బజ్ క్రియేట్ అయ్యిందో.. అదే లెవల్ లో తారక్, చరణ్ సినిమాలపైనా బజ్ ఉంటుంది. అయితే బాహుబలి తెచ్చిన బజ్ ని అందుకోలేకపోయింది సాహో. దీంతో ట్రిపుల్ ఆర్ తర్వాతి ప్రాజెక్ట్ కోసం వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నాడు తారక్. 

 

స్టోరీ సెలక్ట్ చేసుకోవడం కంటే.. మార్కెట్ అంచనాలు అందుకోవడమే చాలా కష్టం. ఆ బజ్ ని సరిగా హ్యాండిల్ చేయలేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అందుకే తారక్ ఇమేజ్ ని సంబంధంంలేని కథలవైపు వెళ్తున్నాడు. మరి రామ్ చరణ్ ఏ ట్రాక్ లోకి వెళ్తాడు అనేదే ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

 

జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి అనే దానిపై చాలా వర్కవుట్స్ చేస్తున్నాడు. ఈ సినిమా తాలూకా ఛాయలు లేని కథల కోసం వెతుకుతున్నాడు. ఈ సెర్చింగ్ లోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ని మీట్ అయ్యాడు. వీళ్లిద్దరి కాంబోలో పొలిటికల్ టచ్ ఉన్న ఫ్యామిలీ స్టోరీ వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

 

రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఏం చేస్తాడు అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటివరకు చిరంజీవి-కొరటాల శివ సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేసేందుకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ తప్ప మరో మూవీ గురించి ఆలోచిస్తున్నట్టే కనిపించడం లేదు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: