టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎవరికీ తెలియదు? ప్రతి ఒక్కరికి తెలుసు.. రామ్ గోపాల్ వర్మని కొందరు పిచ్చోడు అని అంటే.. మరికొందరు.. రామ్ గోపాల్ లా ఒక్క రోజు అయినా బతకాలి రా అని కూడా అంటారు. నిజానికి రామ్ గోపాల్ వర్మ కూడా అతన్ని అతను లఫుట్ అని చెప్పుకుంటాడు.. అది వేరే విషయం. 

 

ఇకపోతే.. మనం టైటిల్ లో చెప్పుకున్నట్టు.. రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి అంటే ప్రాణం. ఈ విషయాన్నీ అయన ఎన్నో సార్లు ఎన్నో చోట్లా చెప్పాడు. వచ్చే జన్మ అంటూ ఉంటె ఎవరిలా పుట్టాలి అనుకుంటున్నారు అని ఆయన్ని అడిగితే రామ్ గోపాల్ వర్మ ఎం చెప్పాడో తెలుసా? బోణి కపూర్ లా పుట్టాలని ఉంది అని చెప్పాడు. 

 

అంత ఇష్టం శ్రీదేవి అంటే.. అయితే ఎప్పుడు శ్రీదేవి గురించి మాట్లాడే వర్మ.. ఆమెను ప్రేమించాడు.. కానీ ప్రేమించింది పెళ్లి చేసుకుని భార్యగా చూసుకోవాలని కాదని, ఆమె తనకు దివి నుండి భువికి దిగివచ్చిన ఆరాధ్య దేవత అని అంటాడు వర్మ. నిజానికి వర్మ సినిమాల్లోకి రావడానికి కారణం కూడా శ్రీదేవి అనే చెప్తుంటాడు వర్మ. 

 

అందుకే ఆమె అంటే రామ్ గోపాల్ వర్మకు ఎంతో ఇష్టం.. ఇక ఆమెతో తాను సినిమాలు చేసినన్ని రోజులు తన కన్నులకు పండుగేనని, అలానే కొన్ని షాట్స్ అయిపోయిన తరువాత కూడా ఆమెనే తదేకంగా చూస్తూ ఉండిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వర్మ అంటుంటారు. ఇక ఆమె బోనిని పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమికుడిగా కొంత తనకు బాధ కలిగినప్పటికీ, ఆమె మంచినే ఎప్పుడూ కోరుకునే వాడినని వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. ఇప్పటికి ఎక్కడైనా ఎవరైనా ఇంటర్వ్యూలో శ్రీదేవి అని అన్నారు అంటే అయన కళ్ళలో ఓ ఆనందం కనిపిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: